Droupadi Murmu Oath : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం
ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ ఎన్వీ రమణ
Droupadi Murmu Oath : భారత దేశ అత్యున్నత పదవిగా భావించే రాష్ట్రపతి గా ఎన్నికైన ద్రౌపది ముర్ము సోమవారం 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశానికి చెందిన త్రివిధ దళాలతో గౌరవ వందనం స్వీకరించారు.
అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన మొదటి ఆదివాసీ మహిళ. అంతకు ముందు ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా పని చేశారు.
ఇక రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము(Droupadi Murmu Oath) ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు 14వ రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన రామ్ నాథ్ కోవింద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతల పాటి వెంకట రమణ ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ వేడుకకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు.
వీరితో పాటు ద్రౌపది ముర్ము స్వంత రాష్ట్రం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ , లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
దేశంలోని పేదలు కలలు కంటారు. వాటిని కూడా నెరవేర్చ గలరనేందుకు ఈ ఎన్నిక ఒక నిదర్శనమని పేర్కొన్నారు ద్రౌపది ముర్ము.
ప్రాథమిక విద్య అన్నది ప్రతి ఒక్కరికి అందాలన్నది తన కల అని, అణగారిన వర్గాల సంక్షేమంపై దృష్టి సారిస్తానని తెలిపారు. అంతకు ముందు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.
Also Read : రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి వేళాయె
#DroupadiMurmu's Historic Oath As #President Of India https://t.co/8KPOGJ4Tqu pic.twitter.com/EDrC0BxfGD
— NDTV (@ndtv) July 25, 2022