Droupadi Murmu : రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి వేళాయె
దేశంలోనే అత్యున్నత పదవిగా గుర్తింపు
Droupadi Murmu : భారత దేశ అత్యున్నత పదవిగా భావించే రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేసిన ఒడిశాకు చెందిన ఆదివాసీ గిరిజన మహిళ ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 14వ రాష్ట్రపతిగా ఉన్న రామ్ నాథ్ కోవింద్ పదవీ విరమణ చేశారు. ఈ మేరకు ఆయనకు వీడ్కోలు కూడా పలికారు.
ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముకు(Droupadi Murmu) ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉదయం 10.15 గంటలకు దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి అధిపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
భారత సైనికులతో గౌరవ వందనం స్వీకరిస్తారు. రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ముందు రాజ్ ఘాట్ ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు.
పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము(Droupadi Murmu) పార్లమెంట్ కు చేరుకుంటారు. 9.42 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది.
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర కేబినెట్ , గవర్నర్లు, సీఎంలు, దౌత్య కార్యాలయ అధిపతులు, ఎంపీలు, ప్రధాన పౌర, సైనిక అధికారులు ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు.
ఇక ఆదివారం పదవీ విరమణ చేసిన రామ్ నాథ్ కోవింద్ విందు ఏర్పాటు చేశారు. తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హాను ఓడించారు.
రాజ్యాంగ బద్దమైన అత్యున్నతమైన పదవిని చేపట్టిన మొదటి గిరిజన, రెండో భారత మహిళ.
Also Read : విద్యాలయాల్లో సమాజ సేవ అవసరం