Bandi Sanjay Son : ‘బండి’ కొడుకా మ‌జాకా

దాదాగిరి..ర్యాగింగ్ వైర‌ల్

Bandi Sanjay Son : నిత్యం నీతులు వ‌ల్లిస్తూ..దేశ సంస్కృతి..భార‌త్ మాతాకీ జై అంటూ నిప్పులు చెరిగే భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర చీఫ్‌, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కొడుకు దాదాగిరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తోటి విద్యార్థిపై దాడికి దిగిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇది వైర‌ల్ గా మారింది. క్యాంప‌స్ ఆవ‌ర‌ణ‌లో శ్రీ‌రామ్ అనే విద్యార్థిని చెంప దెబ్బ కొట్టిన బండి సంజ‌య్ కొడుకు భ‌గీర‌థ్ వీడియో చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. యాజ‌మాన్యం ఫిర్యాదు మేర‌కు తోటి విద్యార్థిపై దాడికి పాల్ప‌డినందుకు భ‌గీర‌థ్ పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

మ‌హీంద్రా యూనివ‌ర్శిటీ ఫిర్యాదు మేర‌కు బండి కొడుకుపై కేసు నమోదైంది. బండి సంజ‌య్ కొడుకు(Bandi Sanjay Son) భ‌గీరథ్ తో పాటు అత‌డి స్నేహితుడు కూడా దాడికి పాల్ప‌డ్డాడు. రెండవ వీడియో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో శ్రీ‌రామ్ ను భ‌గీర‌థ్ , అత‌డి హాస్ట‌ల్ గ‌దిలో దాదాపు ఐదారుమంది విద్యార్థులు దుర్భాష‌లాడ‌డం, కొడుతున్న‌ట్లు స్ప‌ష్టంగా ఉంది ఆ వీడియోలో.

ఇదిలా ఉంగా శ్రీ‌రామ్ త‌న క్లాస్ మేట్ సోద‌రితో అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడంటూ క‌వ‌రింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు బండి భ‌గ‌రీథ. నిన్న సాయంత్రం బండి సంజ‌య్ కుమార్ కార్యాల‌యం కూడా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ ఘ‌ట‌న రెండు నెల‌ల కింద‌ట జ‌రిగింద‌ని , ఆ త‌ర్వాత రాజీ ప‌డ్డామ‌ని శ్రీ‌రామ్ తెలిపాడు.

ఇది ప‌నికి రాని వీడియో..ద‌య‌చేసి దీనిని ఉప‌యోగించ వ‌ద్ద‌ని కోరాడు. రాజ‌కీయంగా త‌న‌ను దెబ్బ కొట్టేందుకు ఇది వాడుకున్నారంటూ ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్.

Also Read : బండి భాష్యం సీఎంకు ఏం సంబంధం

Leave A Reply

Your Email Id will not be published!