Eatala Rajender : ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్ గా ఈట‌ల

కీల‌క ప‌ద‌వి అప్ప‌గించిన బీజేపీ హైక‌మాండ్

Eatala Rajender : బీజేపీ హై కమాండ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ పార్టీ చీఫ్ బండి సంజ‌య్ ను తొల‌గించింది. ఆయ‌న స్థానంలో కిష‌న్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో ఎన్నిక‌ల క‌మిటీ నిర్వ‌హ‌ణ చైర్మ‌న్ గా మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ను నియ‌మించింది. గ‌త కొంత కాలంగా పార్టీలో తీవ్ర క‌ల‌హాలు చోటు చేసుకోవ‌డంతో హైక‌మాండ్ ఫోక‌స్ పెట్టింది.

గ‌త కొన్ని రోజుల నుంచి పార్టీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు చేప‌ట్టింది. చివ‌ర‌కు బండి సంజ‌య్ పై తిరుగుబాటు జెండా ఎగుర వేసిన దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు ప్ర‌స్తుతం సైలెంట్ గా మారారు. మ‌రో వైపు ఈట‌ల రాజేంద‌ర్(Eatala Rajender) సైలెంట్ కావ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇది పార్టీకి మంచిది కాద‌ని, స‌మ‌న్వ‌యం చేసుకునేలా చేయాల‌ని ప్ర‌య‌త్నం చేసింది. చెప్పి చూసినా ఫ‌లితం లేక పోవ‌డంతో చివ‌ర‌కు బండిని త‌ప్పించ‌క త‌ప్ప‌లేదు పార్టీకి.

ఆయ‌న స్థానంలో వివాద ర‌హితుడిగా పేరు పొందిన గంగాపురం కిష‌న్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. త్వ‌ర‌లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో ఇటు తెలంగాణ‌కు చెందిన ఈట‌ల రాజేంద‌ర్ కు కీల‌క ప‌ద‌వి ద‌క్క‌డం, అటు ఏపీకి చెందిన కిర‌ణ్ కుమార్ రెడ్డికి జాతీయ స్థాయిలో సీటు ల‌భించ‌డం విశేషం.

Also Read : Purandeswari : ఏపీ బీజేపీ చీఫ్ గా పురంధేశ్వ‌రి

 

Leave A Reply

Your Email Id will not be published!