Eatala Rajender : పంతం నెగ్గించుకున్న ఈటెల
రెండు చోట్ల పోటీ చేయనున్న రాజేందర్
Eatala Rajender : హైదరాబాద్ – ఉద్యమ నేపథ్యం కలిగిన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పంతం నెగ్గించుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి మంచి పట్టు కలిగి ఉన్న ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలకమైన స్థానంలో ఉన్నారు. ఒకానొక దశలో కేసీఆర్ తర్వాత నెంబర్ 2 గా ఉంటూ వచ్చారు.
Eatala Rajender Got a Chance
ఆర్థిక , ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఈటల రాజేందర్ వేటుకు గురయ్యారు. భూ ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
దమ్ముంటే కేసీఆర్, ఆయన పార్టీ గెలవాలని సవాల్ విసిరారు ఈటల రాజేందర్(Eatala Rajender ). దీంతో దేశ వ్యాప్తంగా ఈటల చర్చనీయాంశంగా మారారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు హుజూరాబద్ లో ఈటలను ఓడించాలని.
తెలంగాణ ఆత్మ గౌరవానికి కల్వకుంట్ల దోపిడీ రాజ్యానికి మధ్య జరుగుతున్న పోరాటంగా ప్రకటించారు రాజేందర్. దీంతో ప్రజలు చెప్పుతో కొట్టారు టీఆర్ఎస్ ను. ఈటలను అఖండ మెజారిటీతో గెలిపించారు. అనంతరం బీజేపీలో కీలకమైన పాత్ర పోషించారు. ప్రస్తుతం కేసీఆర్ బరిలో నిలిచే గజ్వేల్ లో, హుజూరాబాద్ లో రెండు చోట్ల పోటీలో నిలిచారు.
Also Read : Pawan Kalyan : రాధా పెళ్లిలో పవన్ సందడి