Eatala Rajender : వరద బాధితులకు రూ. లక్ష ఇవ్వాలి
బీజేపీ అగ్ర నేత ఈటల రాజేందర్
Eatala Rajender : వరద బాధితులకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా చాలా మంది నిరాశ్రయులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమకు అందిన సమాచారం మేరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు గల్లంతైనట్లు తెలిసిందన్నారు.
Eatala Rajender Asking
వరద ఉధృతి కారణంగా ఇంకా పలు చోట్ల పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయని ప్రభుత్వం వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా దారుణంగా ఉందని ఆవేదన చెందారు ఈటల రాజేందర్(Eatala Rajender). ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఇదే సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను గుర్తించాలని వారికి సర్కార్ భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు ఈటల రాజేందర్.
కేంద్ర ప్రభుత్వ పరంగా తాము కూడా సహాయం అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు మాజీ మంత్రి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నట్లు ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు ఈటల రాజేందర్. అంతకు ముందు జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీలో పర్యటించారు.
Also Read : Revanth Reddy : రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్