Eatala Rajender : హుజూరాబాద్ – మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ లో జరిగే శాసన సభ ఎన్నికల్లో తాను సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించారు. ఈటల చేసిన తాజా ప్రకటనతో అటు బీజేపీలో ఇటు బీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది.
Eatala Rajender Comments Viral
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈటల రాజేందర్(Eatala Rajender) హుజూరాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) బాస్ , సీఎం కేసీఆర్ ఈసారి తాను ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి కూడా బరిలో ఉంటానని స్పష్టం చేశారు.
నవంబర్ 9న నామినేషన్లు వేసేందుకు ముహూర్తం ఖరారు కూడా చేశారు. ఈసారి ఎలాగైనా సరే కేసీఆర్ ను ఓడించాలని , ఆయనకు కోలుకోలేని రీతిలో షాక్ ఇవ్వాలని కంకణం కట్టుకున్నారు ఈటల రాజేందర్. ఇటీవలే సికింద్రాబాద్ లో ముదిరాజుల ఆత్మ గౌరవ సభను నిర్వహించారు. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. సంచలన కామెంట్స్ తో హోరెత్తించారు.
హుజూరాబాద్ లో జరిగిన పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
Also Read : lokesh Kanagaraj Visit : శ్రీవారి సేవలో లోకేష్ కనగరాజ్
