Eatala Rajender : బండితో విభేదాలు లేవు – ఈటల
ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్
Eatala Rajender : తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న బండి సంజయ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బండితో స్నేహం తప్ప శత్రుత్వం అన్నది లేదన్నారు .కొందరు కావాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఇదంతా అబద్దమని స్పష్టం చేశారు.
తనకు కీలకమైన పదవి అప్పగించినందుకు పార్టీ హై కమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో కొత్తగా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన గంగాపురం కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపారు ఈటల రాజేందర్(Eatala Rajender). ఆయనతో కలిసి రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానంటూ స్పష్టం చేశారు.
తెలంగాణలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ కు నిద్ర పోకుండా చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదన్నారు. అసలైన పోటీ గా ఉండేది బీజేపీనేనని పేర్కొన్నారు ఈటల రాజేందర్. ఇన్నాళ్ల పాటు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వచ్చానని అన్నారు. ప్రతి ఒకరిని కలిసే ప్రయత్నం చేశానని తెలిపారు ఈటల. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
Also Read : YS Sharmila : దొరకు బడుల కంటే బార్ల పైనే ధ్యాస
