Eatala Rajender : వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరాలి
Eatala Rajender : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు , హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.గత కొంత కాలంగా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మారుస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఆముదాలపాడు జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించారు ఈటల రాజేందర్.
ఉన్నత స్థాయిలోని పదవుల్లో ఉన్న వారు మాట్లాడేటప్పుడు, ట్వీట్లు చేసేటప్పుడు ముందు వెనుకా ఆలోచించి చేయాలని సూచించారు. ఇది ఎంత మాత్రం పార్టీకి, నేతలకు మంచిది కాదని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఈటల రాజేందర్ తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఓటమి పాలైన కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరుస్తూ ఆ ఇద్దరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. చివరకు తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు ఈటల రాజేందర్(Eatala Rajender).
తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఆసక్తిని రేపింది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచ్ నుంచి ఎంపీగా గెలవాలని గత 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారంటూ స్పష్టం చేశారు .
Also Read : KTR Industries : పల్లెల్లో పారిశ్రామిక వెలుగులు – కేటీఆర్