Eatala Rajender : గెలుస్తా కేసీఆర్ కు షాక్ ఇస్తా
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
Eatala Rajender : గజ్వేల్ – సీఎం కేసీఆర్ ను ఓడించి తీరుతానని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గజ్వేల్ తో పాటు హుజూరాబాద్ లో ప్రస్తుతం బరిలో ఉన్నారు.
Eatala Rajender Slams KCR
దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ప్రధానంగా జాతీయ స్థాయిలో రాజకీయాల పరంగా చక్రం తిప్పాలని చూస్తున్న బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ భవితవ్యం ఈ ఎన్నికలలో తేలి పోనుంది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతటి పోటీని ఎదుర్కొంటున్నారు.
ప్రధానంగా తనతో పాటు ఉద్యమ కాలంలో పని చేసిన ఈటల రాజేందర్(Eatala Rajender) తనపై పోటీ చేయడం ఆసక్తిని రేపుతోంది. గజ్వేల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ ఉన్నట్టుండి కామారెడ్డిలో కూడా బరిలోకి దిగడం విస్తు పోయేలా చేసింది. నాలుగున్నర కోట్ల ప్రజానీకాన్ని విస్తు పోయేలా చేసింది.
ఇది పక్కన పెడితే ఎన్నికల్లో బిగ్ ఫైట్ నడుస్తోంది నువ్వా నేనా అంటూ. ఓ వైపు కేసీఆర్ ఎక్కువగా రెండు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. మరో వైపు ఆయా నియోజకవర్గాలలో మెజారిటీ మరింత పెరిగేలా చూడాలని అల్లుడు హరీశ్ ను ఆదేశించారు. కామారెడ్డిలో కొడుకు చూసుకుంటే గజ్వేల్ ను హరీశ్ చూసుకుంటున్నారు.
ఈ తరుణంలో దీనిని ఛాలెంజ్ గా తీసుకున్నారు ఈటల రాజేందర్. ఎలాగైనా సరే తాను గెలుస్తానని అంటున్నారు . ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Contract Out Sourcing : కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫైర్