Eatala Rajender : దాడి దారుణం ఈటల ఆగ్రహం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిర్వాకంపై ఫైర్
Eatala Rajender : హైదరాబాద్ – మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో అందరూ చూస్తూ ఉండగానే భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై భౌతికంగా దాడికి దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Eatala Rajender Serious on MLA Vivekananda
దొర అహంకారానికి పరాకాష్ట ఈ దాడి అని పేర్కొన్నారు ఈటల రాజేందర్(Eatala Rajender). గౌడ్ గొంతు నొక్కడం, భౌతికంగా దాడికి దిగడం దారుణమన్నారు. దీనిని పూర్తిగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకుల అహంకారానికి ఇది పరాకాష్టగా అభివర్ణించారు ఎమ్మెల్యే. ప్రజా స్వామ్యంలో భౌతిక దాడులు ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు. అవినీతి , అక్రమాలకు బీఆర్ఎస్ సర్కార్ తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థి లేవనెత్తిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాడులకు దిగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ఈటల రాజేందర్.
Also Read : BRS MLA Vivekananda Attack : బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాదాగిరి