Eatala Rajender KCR : కేసీఆర్ అంతం నా పంతం – ఈటల
సీఎం ఓటమే నా లక్ష్యం
Eatala Rajender KCR : భారతీయ జనతా పార్టీ అగ్ర నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు.
గజ్వేల్ లో సీఎం కేసీఆర్(KCR) పై పోటీ చేస్తా. దమ్ముంటే తనపై పోటీకి కేసీఆర్ దిగాలని సవాల్ విసిరారు. తాను పెంచి పోషిస్తున్న బానిసలతో తిట్టించడం మంచి పద్దతి కాదన్నారు.
కేసీఆర్ పని ఖతమైందని ఇక మిగిలింది ఫామ్ హౌస్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఆయనను ఓడించేంత వరకు తాను నిద్ర పోనని స్పష్టం చేశారు ఈటల రాజేందర్ .
ఒక వేళ కేసీఆర్(CM KCR) కు దమ్ము, ధైర్యం , ఖలేజా ఉంటే తాను సవాల్ చేసి గెలిచిన హుజూరాబాద్ నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
ఊసర వెల్లులు, పెంపుడు కుక్కలు మాట్లాడే వారికి తాను సమాధానం ఇవ్వనని అన్నారు. అన్ని పార్టీలకు చెందిన వారంతా తనతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన సీఎం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఈటల రాజేందర్(Eatala Rajender) డిమాండ్ చేశారు.
నగరం చుట్టు పక్కల అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారి పోయాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన దృష్టిలో బానిసలే నాయకులని, ఆత్మాభిమానం ఉన్న వాళ్లు కాదన్నారు.
తనకంటూ శత్రువులు ఎవరూ లేరన్నారు. పార్టీ నుంచి పలువురు నేతలు వెళ్లి పోతున్నా కేసీఆర్ పట్టనట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు.
Also Read : పాలకుల వైఫల్యం ‘అభాగ్యనగరం’