Eatala Rajender : దొర‌ల రాజ్యం దొంగ‌ల‌దే పెత్త‌నం

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్

Eatala Rajender : జ‌డ్చ‌ర్ల – బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. దొర‌ల పాల‌న కొన‌సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. అవినీతి, అక్ర‌మాల‌కు బీఆర్ఎస్ పాల‌న కేరాఫ్ గా మారింద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ ను , ఆయ‌న కుటుంబాన్ని ఏకి పారేశారు ఈట‌ల రాజేంద‌ర్.

Eatala Rajender Slams BRS Govt

ఇక్క‌డ పార్టీ అభ్య‌ర్థిగా నిల‌బ‌డిన చిత్త‌రంజన్ దాస్ బ‌హుజ‌న బిడ్డ అని, ఆయ‌న‌కు అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌న్నారు. ఆనాడు దివంగ‌త ఎన్టీ రామారావును ఓడించిన ఘ‌న‌మైన చ‌రిత్ర దాస్ ది అని పేర్కొన్నారు ఈట‌ల రాజేంద‌ర్.

ఆయ‌న మంత్రి ప‌ద‌విని కూడా నిర్వ‌హించార‌ని తెలిపారు. త‌మ పార్టీ ఏ పార్టీ చేయ‌ని విధంగా బీసీని సీఎంగా చేస్తామ‌ని సాక్షాత్తు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు. అంతే కాదు గ‌త కొన్నేళ్లుగా అప‌రిష్కృతంగా ఉన్న ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ కూడా ఇచ్చార‌ని స్ప‌ష్టం చేశారు.

రైతుల‌ను ఆదుకునే స‌త్తా ఒక్క కేంద్రానికే ఉందన్నారు. బీజేపీ ని ఆశీర్వ‌దిస్తే రూ. 3,100 వ‌రికి మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్(Eatala Rajender). కేసీఆర్ రేష‌న్ కార్డులే కాదు..రేషన్ బియ్యం కూడా ఇవ్వ‌డం లేద‌న్నారు.
బీజేపీ దోచు కోవ‌డానికో లేదా దాచు కోవ‌డానికి రాలేద‌న్నారు. ఆక‌లికి, పేద‌రికానికి కార‌ణం కాంగ్రెస్ పార్టీ అని ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : Priyanka Gandhi : మోదీ ప్ర‌భుత్వం దేశానికి శాపం

Leave A Reply

Your Email Id will not be published!