Eatala Rajender : న‌యా పైసా లేని పేదోడిని – ఈట‌ల‌

కేసీఆర్ లాగా ఉన్నోడిని కాను

Eatala Rajender : గ‌జ్వేల్ – మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. తాను సీఎం కేసీఆర్ లాగా ఉన్నోడిని కాన‌ని, న‌యా పైసా లేని పేదోడినని అన్నారు.

Eatala Rajender Comment

తాజాగా ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ తొలి జాబితా ప్ర‌క‌టించింది. ఇందులో రెండు స్థానాల‌లో ఈట‌ల‌ను ఖ‌రారు చేసింది. ఆయ‌న ముందు నుంచీ చెబుతూ వ‌స్తున్నారు. తాను కేసీఆర్ ను ఓడిస్తాన‌ని, త‌న‌కు గ‌జ్వేల్ సీటు కేటాయించాల‌ని. ఈట‌ల(Eatala Rajender) కోరికను మ‌న్నించింది హై క‌మాండ్. అటు హుజూరాబాద్ ఇటు గ‌జ్వేల్ రెండు స్థానాల నుంచి తాను బ‌రిలో ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు ఈట‌ల రాజేంద‌ర్.

సీఎం కేసీఆర్ ను ఎలాగైనా స‌రే ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. త‌న‌కు అపూర్వ స్వాగ‌తం ప‌లికినందుకు ఆనందంగా ఉంద‌న్నారు. పేరు పేరునా ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని స్ప‌ష్టం చేశారు ఈట‌ల రాజేంద‌ర్.

1992లో గ‌జ్వేల్ నియోక‌వ‌ర్గంలో అడుగు పెట్టాను. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌తో త‌న‌కు ద‌గ్గ‌రి అనుబంధం ఉంద‌న్నారు . 2002లో ములుగు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో తాను టీఆర్ఎస్ లో చేరాన‌ని గుర్తు చేసుకున్నారు. 2004లో ఎమ్మెల్యే అయ్యాక‌, ఉద్య‌మాన్ని ఆవిష్క‌రించాన‌ని అన్నారు.

మంత్రి ప‌ద‌విని త్య‌జించా. పేద‌ల గొంతుక‌గా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు ఈట‌ల రాజేంద‌ర్. కేసీఆర్ కు అధికార యావ ఎక్కువ‌. ప‌ద‌వి లేక పోతే ఉండ‌లేడ‌ని అన్నారు. రోషం ఉన్న బిడ్డ‌ను. సీఎంను త‌ప్ప‌క ఓడించి తీరుతాన‌ని ప్ర‌క‌టించారు.

Also Read : TTD JOBS 2023 : టీటీడీలో ప‌ర్మినెంట్ జాబ్స్

Leave A Reply

Your Email Id will not be published!