Eatala Rajender : ఓటమి భయంతో పారి పోయిండు
మాజీ మంత్రి ఈటల రాజేందర్
Eatala Rajender : హుజూరాబాద్ – బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ . ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో బీజేపీ తరపున మరోసారి బరిలో నిలిచారు. ఈ సందర్బంగా అడుగడుగునా ఈటెలకు బ్రహ్మరథం పట్టారు. ఈ సంరద్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు రాజేందర్.
Eatala Rajender Comments Viral
తాను ఓడి పోతానని తెలిసి భయపడి కామారెడ్డికి పారి పోయిండంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికల్లో ఈటెల రాజేందర్(Eatala Rajender) రెండు చోట్ల పోటీకి దిగారు. సీఎం కేసీఆర్ పై గజ్వేల్ లో బీజేపీ నుంచి బరిలో ఉండగా హుజూరాబాద్ లో సై అంటున్నారు.
కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని అనుకుంటున్నారని కానీ తనకు ఆ తాహతు లేదన్నారు. డబ్బులు ఖర్చు చేసే స్థితిలో లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో పవర్ లోకి వచ్చిన బీఆర్ఎస్ పూర్తిగా వాటిని విస్మరించిందని ఆరోపించారు ఈటెల రాజేందర్.
ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇంత కాలం అహంకార పూరితంగా వ్యవహరిస్తూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఓడి పోతానేమోనని ఆందోళనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఓటమి ఖాయమని అన్నారు ఈటెల రాజేందర్.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ