Eatala Rajender : జితేందర్ ట్వీట్ ఈటల కామెంట్
బీజేపీలో కలకలం రేపుతున్న వీడియో
Eatala Rajender : రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతోందనే దానిపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఉన్నట్టుండి మాజీ ఎంపీ ఆముదాలపాడు జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ మరింత మంట పెట్టేలా చేసింది. ఆయన ట్విట్టర్ వేదికగా ఓ వ్యక్తి దున్నపోతును తన్నుతున్న వీడియోను షేర్ చేశారు. ఎంతకూ మాట వినక పోవడంతో ఓ తన్ను తన్నడం, అది వెంటనే వ్యాన్ లోకి ఎక్కడం ఉన్న సన్నివేశాన్ని షేర్ చేశారు. ఆపై క్యాప్షన్ కూడా రాశారు మాజీ ఎంపీ.
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమని పేర్కొన్నారు. ఆయన చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఆపై అధినాయకత్వం దాకా వెళ్లింది. ఈ ట్వీట్ ను ఆయన పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు కీలకమైన నేత బీఎల్ సంతోష్ కు కూడా ట్యాగ్ చేశారు.
ఎవరిని ఉద్దేశించి ఇలా కామెంట్ పెట్టాడనేది ఎవరికీ అంతు చిక్కలేదు. దీంతో బీజేపీ నాయకత్వంలో తీవ్ర చర్చకు దారి తీసేలా చేసింది. దీనిపై తలా ఒకరు మాట్లాడుతున్నారు. తాజాగా శుక్రవారం దీనిపై సీరియస్ గా స్పందించారు ఆ పార్టీకి చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender).
ఏదైనా మాట్లాడేప్పుడు లేదా ట్వీట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నామో పక్కా ఆధారాలు ఉంటే బెటర్ అని సూచించారు. తనకైనా లేదా జితేందర్ కైనా ఎవరికైనా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. మొత్తంగా ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు మాజీ ఎంపీ. కానీ ఇప్పుడు అంతటా వైరల్ గా మారింది.
Also Read : Putin Praises : మోదీ నాకు చిరకాల మిత్రుడు – పుతిన్