EC National Party Rules : జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే
ఈసీని కలిసిన టీఆర్ఎస్ నేతలు
EC National Party Rules : తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇందుకు సంబంధిం పార్టీ తీర్మానం కూడా చేసింది. ఈ కాపీని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మకు కాపీని అందజేశారు.
చట్ట ప్రకారం పరిశీలించి జాతీయ పార్టీగా ప్రకటించాలా లేదా అన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్ చేసిన ప్రకటనతో అసలు ఒక పార్టీ జాతీయ పార్టీ ప్రకటించాలంటే కొన్ని నియమాలు పూర్తి చేయాల్సి వచ్చింది(EC National Party Rules). ఎన్నికల కమిషన్ కొన్ని రూల్స్ కూడా పొందు పర్చింది. కేంద్ర ఎన్నికల సంఘం -1968 నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది.
మూడింటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాల్సిందే. సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే మించి రాష్ట్రాలలో పోటీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోల్ అయి చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. కనీసం ఒక రాష్ట్రం నుంచి నాలుగు లోక్ సభ స్థానాలు గెలుపొందాలి.
నాలుగు రాష్ట్రాలలో 11 లోక్ సభ సీట్లలో విజయం సాధించాలి. ఇందులో రెండు శాతం సీట్లు సాధించాల్సి ఉంటుంది. గెలుపొందిన వారిలో మూడు రాష్ట్రాల నుంచి ఎన్నిక కావాలి. నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి.
అంతే కాకుండా జాతీయ పార్టీగా పేరు నమోదు చేసుకునే పార్టీ గుర్తు కేంద్ర ఎన్నికల సంఘంలో ఇప్పటికే నమోదైన పార్టీలకు పతాకం, గుర్తు ఉండ కూడదు. ఇదే విషయాన్ని ఈసీ స్పష్టం చేసింది.
Also Read : కేసీఆర్ కలలు గులాబీ రెపరెపలు