ECI Announce Election : 5 రాష్ట్రాల ఎన్నిల‌క షెడ్యూల్ విడుద‌ల

ప్ర‌క‌టించిన కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్

ECI Announce Election : న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సోమ‌వారం సీఈసీ రాజీవ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో ఎన్నిక‌ల షెడ్యూల్ ను వెల్ల‌డించారు. దేశంలోని రాజ‌స్థాన్ , ఛ‌త్తీస్ ఘ‌డ్ , మ‌ధ్య ప్ర‌దేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ECI Announce Election Dates

ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం బృందం ప‌ర్య‌టించింది. ఆయా రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు, కీల‌క పాత్ర పోషించే ప్ర‌భుత్వ సంస్థ‌ల ఉన్న‌తాధికారుల‌తో కూడా చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు.

ఈసారి శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు సీఈసీ(ECI) రాజీవ్ కుమార్. వృద్దులు, దివ్యాంగుల‌కు వీలుగా ఇంటి వ‌ద్ద నుండి ఓటు వేసేందుకు ఛాన్స్ ఇచ్చామ‌ని స్ప‌ష్టం చేశారు. డిసెంబ‌ర్ , జ‌న‌వ‌రి నెల‌ల్లో ప్ర‌క‌టించిన 5 రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

గ‌తంలో కంటే ఈసారి భారీ స్థాయిలో ఓట్లు న‌మోదు చేసుకున్నార‌ని ప్ర‌శంసించారు. ప్ర‌త్యేకించి మ‌హిళ‌లు, యువ‌త కూడా భారీగా ఓట్లు న‌మోదు చేసుకోవ‌డం త‌మ‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు. వృద్దులు, వికలాంగుల‌కు వాహ‌న సౌక‌ర్యం ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ఒక‌వేళ ఓటు వేసే కేంద్రానికి వ‌స్తామంటే అక్క‌డికి తీసుకు వ‌చ్చి ఓటు వేశాక ఇంటి వ‌ద్ద దించుతార‌ని పేర్కొన్నారు.

Also Read : YS Sharmila : కాంగ్రెస్ రిక్త హ‌స్తం పోటీకి సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!