Sonia Gandhi ED : సోనియా గాంధీ అభ్యర్థనకు ఈడీ ఓకే
ఇంకా ఆరోగ్యం కుదట పడలేదని లేఖ
Sonia Gandhi ED : నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ వాయిదా వేయాలన్న ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi ED) చేసిన అభ్యర్థనను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆమోదించింది.
మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ నేటితో జూన్ 22తో కలుపుకుని ఐదు రోజులుగా ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.
కానీ సోనియా గాంధీ అనారోగ్య కారణాల రీత్యా హాజరు కాలేక పోయారు. ఆమెకు నోటీసులు జారీ చేసిన అనంతరం టెస్టులు నిర్వహించారు.
ఈ పరీక్షల్లో సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హుటా హుటిన ఆమెను ఢిల్లీలోని గంగా రామ్ ఆస్పత్రిలో చేర్చారు. ఏడు రోజుల చికిత్స అనంతరం ఈనెల 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది.
కాగా ఈనెల 23న తమ ముందు హాజరు కావాలంటూ ఈడీ తిరిగి గడువు ఇచ్చింది. దీంతో రేపు గురువారం హాజరు కావాల్సి ఉండగా తన ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదని, వైద్యులు రెస్ట్ తీసుకోమన్నారని సూచించినట్లు ఈడీకి(Sonia Gandhi ED) రాసిన లేఖలో తెలిపింది.
ఈ మేరకు ఆరోగ్యం కుదుట పడ్డాక తాను ఈడీ ముందు హాజరవుతానని స్పష్టం చేసింది. అనారోగ్యం దృష్ట్యా ఈడీ సోనియా గాంధీ చేసిన అభ్యర్థనను మన్నించింది ఈడీ.
ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మీడియా ఇంచార్జి, ఎంపీ జై రామ్ రమేష్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
Also Read : ఆర్థిక సంక్షోభం శ్రీలంకకు సహకారం