Pooja Singhal : ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ అరెస్ట్
మనీ లాండరింగ్ కేసు వ్యవహారం
Pooja Singhal : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన మనీలాండరింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న జార్ఖండ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్(Pooja Singhal) ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.
ఆమె ఉన్నతాధికారిగా పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈడీ కేసులు నమోదు చేసింది. ఇటీవలే పూజా సింఘాల్(Pooja Singhal) కు సంబంధించిన ఇళ్లల్లో పలు చోట్ల దాడులు చేపట్టింది.
దాదాపు రూ. 25 కోట్లకు పైగా నగదు పట్టు పడిందని అంచనా. వాటితో పాటు విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకుంది ఈడీ. పూజా సింఘాల్ ను అరెస్ట్ చేసే కంటే ముందు కొన్ని గంటల పాటు ప్రశ్నించింది.
జార్ఖండ్ లో జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల్లో జరిగిన అవకవతకలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఆమె ప్రస్తుతం జార్ఖండ్ లో మైనింగ్ కార్యదర్శిగా పని చేస్తోంది. సీఎం సోరేన్ కు సన్నిహితురాలిగా పేరు పొందింది.
జూనియర్ ఇంజనీర్ రాం వినోద్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది ఈడీ. ఇందులో భాగంగా నమోదు చేసిన కేసులో పూజా సింఘాల్(Pooja Singhal), ఇతరులపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
2008 నుంచి 2011 దాకా ప్రభుత్వ నిధులను తనతో పాటు తమ కుటుంబీకులకు దారి మళ్లించినట్లు వెలల్డైంది. అప్పట్లో ఛత్ర, ఖుంటి, పలము జిల్లా డిప్యూటీ కమిషనర్ , జిల్లా మేజిస్ట్రేట్ గా వ్యవహరించిన పూజా సింఘాల్ సహా పలువురిపై నిధులు స్వాహా చేశారనే అభియోగాలు నమోదైనట్లు ఈడీ తెలిపింది.
Also Read : శరద్ పవార్ పై నానా పటోలే కన్నెర్ర