ED Charge Sheet : లిక్కర్ స్కాంలో ఎంపీలు సంజయ్..చద్దా
ఛార్జిషీట్ లో ఆప్ ఎంపీ పేరు ప్రస్తావన
ED Charge Sheet : ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజు రోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ ను తాజాగా చేర్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ. కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో సింగ్ ను చేర్చడం కలకలం రేపింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 34 మందిపై అభియోగాలు మోపింది. ఆప్ అగ్ర నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో కొలువు తీరారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ , ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను చేర్చింది. సంజయ్ సింగ్ తో పాటు రాజ్యసభ ఎంపీ , పంజాబ్ సలహాదారు రాఘవ్ చద్దా పేరు కూడా ఉన్నాయి. ఛార్జిషీట్ లో ఆప్ నేత సంజయ్ సింగ్ పేరు ను ప్రత్యేకంగా ప్రస్తావించింది దర్యాప్తు సంస్థ.
ఇదిలా ఉండగా ఛార్జ్ షీట్ లో(ED Charge Sheet) ఇద్దరి ఎంపీల పేర్లు ఈడీ చేర్చింది కానీ నిందితులుగా కాదు. అరెస్ట్ అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో జరిగిన సమావేశంలో రాఘవ్ చద్దా కూడా పాల్గొన్నారని , ఇందులో అతడి ప్రమేయం కూడా ఉందని పేర్కొంది ఈడీ. మనీష్ సిసోడియా మాజీ కార్యదర్శి సి. అరవింద్ తన ప్రకటనలో రాఘవ్ చద్దా పేరును ప్రస్తావించినట్లు వెల్లడించింది.
Also Read : ఎన్సీపీ అధ్యక్ష పదవికి గుడ్ బై
