MLC Kavitha ED : ఎమ్మెల్సీ క‌విత‌కు ఒక్క‌రికే ప‌ర్మిష‌న్

భ‌ర్త అనిల్ ..లాయ‌ర్ కు నో ఛాన్స్

MLC Kavitha ED : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం లో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొని ఈడీ నోటీసు అందుకున్న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత శ‌నివారం ఈడీ ఆఫీసు ముందుకు చేరుకున్నారు. కవిత వెంట భ‌ర్త అనిల్ , మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ వ‌చ్చారు. ఆమె వెంట ఈడీ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేశారు. సెక్యూరిటీని, భ‌ర్త అనిల్ ను లోప‌ల‌కు అనుమ‌తించ లేదు.

సీనియ‌ర్ అడ్వొకేట్ గండ్ర మోహ‌న్ రావును ద‌రిదాపుల్లోకి రానివ్వ‌లేదు. క‌విత‌కు(MLC Kavitha ED) తాను బినామీ అంటూ హైద‌రాబాద్ వ్యాపార‌వేత్త అరుణ్ రామ‌చంద్ర పిళ్లై ఈడీ విచార‌ణ‌లో చెప్ప‌డంతో ఈడీ నోటీసులు జారీ చేసింది. తాను 9న రాలేన‌ట్లు చెప్ప‌డంతో ఈడీ సీరియ‌స్ అయ్యింది. మార్చి 11న రావాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది. ఇక విచార‌ణ సంద‌ర్భంగా హుటా హుటిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు.

ఢిల్లీ సీఎం నివాసం ముందు భారీ ఎత్తున చేరుకోవ‌డంతో ముందు జాగ్ర‌త్త‌గా ఢిల్లీ పోలీసులు గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఇక క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌హిళా బిల్లు ప్ర‌వేశ పెట్టాల‌ని కోరుతూ మార్చి 10 శుక్ర‌వారం దీక్ష‌కు దిగారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి వ్య‌తిరేకంగా ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు వేశారు. ఆ పోస్ట‌ర్ల‌లో బై బై మోదీ అని ఎమ్మెల్సీ క‌విత ఫోటో కూడా ఉంది.

దారి పొడ‌వునా చేరుకున్న పార్టీ శ్రేణులు ఈడీ ఆఫీసు వ‌ద్దకు చేరుకున్నాయి. కేవ‌లం రెండు వాహ‌నాల‌ను మాత్ర‌మే ప‌ర్మిష‌న్ ఇచ్చింది ఈడీ. ఎవ‌రినీ లోప‌లికి వెళ్ల‌నీయ లేదు.

Also Read : ఈడీ ముందుకు క‌విత భారీ భ‌ద్ర‌త

Leave A Reply

Your Email Id will not be published!