Partha Arpitha Farmhouse : పార్థ..అర్పిత ఫామ్ హౌస్ పై దాడి
ఇప్పటికే మంత్రి, అర్పిత అదుపులో
Partha Arpitha Farmhouse : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్ వ్యవహారం. ఆయనకు సన్నిహితురాలిగా పేరొందిన సినీ నటి అర్పిత ముఖర్జీ నివాసాలలో ఈడీ ఏకకాలంలో దాడి చేసింది.
కళ్లు చెదిరేలా రూ. 50 కోట్ల రూపాయలతో పాటు 5 కేజీల బంగారం పట్టుబడింది. ఇందులో భాగంగా ఇంటితో పాటు ఫ్లాట్ ను సోదా చేపట్టింది.
ఈ తరుణంలో శాంతినికకేతన్ ఫామ్ హౌస్ లో తనిఖీ చేశారు. కోల్ కతాకు చెందిన ఓ ఫ్యామిలీ నుంచి 2012లో పార్థ చటర్జీ, అర్పితా ముఖర్జీ సంయుక్తంగా కొనుగోలు చేశారు.
ఈ ఫామ్ హౌస్ పేరు అపా. ఇది అర్పిత, పార్థ సంక్షిప్త రూపమని నమ్ముతారు ఇక్కడివారు. పార్థ – అర్పిత శాంతినికేతన్ ఫామ్ హౌస్ లో 7 గంటలకు పైగా కేంద్ర దర్యాప్త సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేపట్టింది.
బెంగాల్ లో టీచర్ భర్తీ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థ ఛటర్జీ , ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ(Partha Arpitha) సంయుక్తంగా యజమానిగా భావిస్తున్న కోల్ కతాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది శాంతి నికేతన్ ఫామ్ హౌస్.
ఇటీవల జరిగిన దాడులు, సోదాల్లో ఈ ఫామ్ హౌస్ ఉన్నట్లు గుర్తించారు. 2012లో దీనిని సంయుక్తంగా రూ. 20 లక్షలకు కొనుగోలు చేశారు అర్పితా..పార్థ ఛటర్జీ. 2020లో అర్పితా ముఖర్జీ పేరు మద మ్యుటేషన్ జరిగింది.
సోదాలలో భాగంగా ఫామ్ హౌస్ చుట్టూ , లోపట తనిఖీలు చేశారు. భూమి లోపట ఏమైనా డబ్బులు దాచి పెట్టారా అన్న కోణంలో సోదాలు చేపట్టారు.
Also Read : మోదీతో భేటీ కానున్న దీదీ