ED Raids : లిక్కర్ పాలసీ కేసులో 35 చోట్ల దాడులు
ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్ లలో సోదాలు
ED Raids : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ మరింత దూకుడు పెంచింది. శుక్రవారం దేశ వ్యాప్తంగా దాడులు చేపట్టింది. దేశంలోని దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్ , తదితర నగరాలలో సోదాలు(ED Raids) చేపట్టింది. మొత్తం 35 చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగం పెంచింది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన నేపథ్యంలో గత ఏడాది నవంబర్ 17 నుంచి అమలు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని ఈ ఏడాది 2022 జూలైలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రద్దు చేసింది. ఏజెన్సీ బృందాలు ప్రధాన కార్యాలయం నుండి ప్రధాన నగరాలను జల్లెడ పట్టింది ఈడీ.
కేసుకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లోని మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, నెట్ వర్క్ లకు సంబంధంచిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున నుంచి దాడులు కొనసాగుతున్నాయి. దీనిపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. దాడులను డర్టీ పాలిటిక్స్ అంటూ మండిపడ్డారు.
గత మూడు నెలల నుండి 500 కంటే ఎక్కువ దాడులు చేపట్టారు. 300 కంటే ఎక్కువ సీబీఐ, ఈడీ అధికారులు గత 24 గంటల నుండి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంత మంది అధికారుల సమయాన్ని వారి నీచ రాజకీయాల కోసం వృధా చేస్తున్నారంటూ మండిపడ్డారు అరవింద్ కేజ్రీవాల్. ఇలాంటి చర్యల వల్ల దేశం ఎలా పురోగమిస్తుందని ప్రశ్నించారు. మద్యం స్కాం కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు 14 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
Also Read : జమ్మూ కాశ్మీర్ లో తగ్గిన తీవ్రవాదం – షా