ED Raids Ponmudi : తమిళనాడు మంత్రి పొన్ముడిపై ఈడీ రైడ్స్
కుమారుడు గౌతమ్ సిగమణిపై దాడులు
ED Raids Ponmudi : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి మంత్రి పొన్ముడితో పాటు ఆయన కుమారుడు గౌతమ్ సిగమణిపై ఈడీ దాడులు చేపట్టింది. దాడుల్లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఏక కాలంలో ఈడీ బృందాలు రైడ్స్ కు పాల్పడడం కలకలం రేపుతోంది.
ఇప్పటికే తమిళనాడు మంత్రివర్గంలో కీలకమైన మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ(Senthil Balaji)పై దాడులు చేపట్టింది ఈడీ. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. కోర్టుకు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కానీ దాఖలు చేసిన పిటిషన్ ను తోసి పుచ్చింది ధర్మాసనం. దీంతో జైలు పాలు కాక తప్పలేదు.
దీనిపై తాము ఉన్నత న్యాయ స్థానంను ఆశ్రయిస్తామని ప్రకటించారు సీఎం ఎంకే స్టాలిన్, తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఇదిలా ఉండగా కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుండడం వల్లనే ఈడీ తమపై దాడులు చేస్తోందంటూ ఆరోపించారు సీఎం.
ఇదంతా కావాలని చేస్తున్నారని, ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు ఎంకే స్టాలిన్. మొత్తంగా కేంద్రం, వర్సెస్ తమిళనాడు రాష్ట్రం మధ్య వార్ కొనసాగుతోంది. ఈ తరుణంలో దాడుల పరంపర కంటిన్యూగా జరగడం ఒకింత విస్తు పోయేలా చేసింది డీఎంకే శ్రేణులను.
Also Read : Kaavaalaa Song : తలైవా కావాలా సాంగ్ రికార్డ్