Mallikarjun Kharge : మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు ఈడీ స‌మ‌న్లు

పార్ల‌మెంట్ లో ఉంటే ప్ర‌శ్నిస్తారా

Mallikarjun Kharge : నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక మ‌నీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి రాజ్య‌స‌భ కాంగ్రెస్ పార్టీ ప‌క్ష నేత‌, ఎంపీ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది.

కేసుతో సంబంధం ఉన్న యంగ్ ఇండియ‌న్ సంస్థ కార్యాల‌యాల‌లో ఈడీ సెర్చ్ కు హాజ‌రు కావాల్సి ఉంది ఖ‌ర్గే. కానీ ఎంపీ డుమ్మా కొట్టారు.

దీంతో సీరియ‌స్ గా తీసుకున్న ఈడీ స‌మ‌న్లు ఇచ్చింది. దీనిపై పార్ల‌మెంట్ లో గురువారం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఈ సంద‌ర్భంగా మ‌ల్లికార్జున ఖ‌ర్గే రాజ్య‌స‌భ‌లో త‌న‌కు స‌మ‌న్లు ఎలా జారీ చేస్తారంటూ నిప్పులు చెరిగారు.

తాను వ‌ర్షాకాల స‌మావేశాల్లో పాల్గొంటున్నా. ప్ర‌జ‌ల‌కు, దేశానికి సంబంధించిన ప్ర‌శ్న‌లు అడుగుతున్నా. స‌మావేశంలో ఉన్న స‌మ‌యంలో స‌మ‌న్లు

జారీ చేసే అధికారం ఈడీకి ఎలా ఉందంటూ ప్ర‌శ్నించారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge).

ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీని మూడు రోజుల పాటు రాహుల్ గాంధీని ఐదు రోజుల పాటు 60 గంట‌లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది ఈడీ.

ఇదే క్ర‌మంలో ప‌త్రిక‌కు సంబంధించి మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కు కూడా నోటీసులు జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ లో

ఔట్ లెట్ ను నిర్వ‌హిస్తున్న అసోసియేటెడ్ జ‌ర్న‌ల్స్ యాజ‌మాన్యం లోని యంగ్ ఇండియ‌న్ లిమిటెడ్ కార్యాల‌యాల‌కు ఏజెన్సీ సీల్ వేసింది.

మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కంప‌నీకి అధీకృత ప్ర‌తినిధి అని, ఆయ‌న అక్క‌డ లేక పోవ‌డంతో సీల్ వేయాల్సి వ‌చ్చింద‌ని ఈడీ స్ప‌ష్టం చేసింది.

దీనిపై ఎంపీ లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌కు ఘాటుగా బ‌దులు ఇచ్చారు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్. ఏ చ‌ట్టాన్ని అమ‌లు చేసే సంస్థ ప‌నిలో ప్ర‌భుత్వం

జోక్యం చేసుకోంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : శివ‌సేన పార్టీ ఎవ‌రిద‌నే దానిపై తొంద‌ర వ‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!