Abhishek Banerjee : అభిషేక్ బెనర్జీకి ఈడీ సమన్లు జారీ
బొగ్గు స్కాం కేసులో హాజరు కావాలని ఆదేశం
Abhishek Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి(Mamata Banerjee) కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే తన కేబినెట్ లో మంత్రి పార్థ సారథిని ఈడీ అదుపులోకి తీసుకుంది.
ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా అంతా తానై వ్యవహరిస్తూ వస్తున్న దీదీ అల్లుడు అభిషేక్ బెనర్జీకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఝలక్ ఇచ్చింది.
ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసింది. తాజాగా సమన్లు జారీ చేసింది ఎంపీకి. బొగ్గు స్కాంకు సంబంధించిన కేసులో విచారణకు సంబంధించి సెప్టెంబర్ 2న తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది.
అంతకు ముందు ఇదే బొగ్గు స్కాంకు సంబంధించి పాలు పంచుకున్నారనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్ కు చెందిన ఐపీఎస్ అధికారులను నోటీసులు జారీ చేసింది.
వారంతా ఢిల్లీలోని ఈడీ ఆఫీసు ముందు హాజరయ్యారు. ప్రస్తుతం తనకు సంబంధించిన విచారణను ఢిల్లీలో కాకుండా పశ్చిమ బెంగాల్ లోనే విచారించాలని కోర్టును ఆశ్రయించారు ఎంపీ అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee).
కోర్టు ఆదేశాల మేరకు ఈడీ తన పరిమితి దాట లేదు. ఈ మేరకు వెంటనే ఆ తేదీన కోల్ కతా లోని ఏజెన్సీ కార్యాలయానికి హాజరు కావాలని జారీ చేసిన సమన్లలో స్పష్టం చేసింది.
కేంద్రం కావాలనే బీజేపీయేతర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తోందని, వారికి దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు గురి చేస్తోందంటూ నిప్పులు చెరిగారు టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
మరో వైపు కేంద్రం పూర్తిగా బెంగాల్ పై ఫోకస్ పెట్టింది.
Also Read : స్మృతీ ఇరానీ ఫోన్ చేసినా నో రెస్పాన్స్