DK Shivakumar : డీకే శివకుమార్ కు ఈడీ సమన్లు
ఎదుర్కునేందుకు సిద్దమన్న చీఫ్
DK Shivakumar : కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) చీఫ్ డీకే శివకుమార్ కు సమన్లు జారీ చేసింది.
దీనికి సంబంధించి డీకే శివకుమార్(DK Shivakumar) గురువారం స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ సమన్లు ఇవ్వడం మామూలేనని పేర్కొన్నారు. తాను సహకరించేందుకు సిద్దంగా ఉన్నానని కానీ సమయం కావాలన్నారు.
ఎందుకంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేందుకు తాను రెడీగా లేనని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తో పాటు డీకే శివకుమార్ పాల్గొంటున్నారు.
ఇదిలా ఉండగా ఈ యాత్ర తమిళనాడులో ప్రారంభమైంది. ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. ఇక్కడ 18 రోజుల పాటు ఉంటుంది. అనంతరం మరికొద్ది రోజుల్లో కర్ణాటకలో అడుగు పెట్టనుంది భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra).
ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాల మధ్య లోనే ఈ నోటీసు వచ్చిందని డీకే శివకుమార్ చెప్పారు. ఇదిలా ఉండగా సమన్లు అందుకున్న మాట వాస్తవమేనని ఏజెన్సీనికి సహకరిస్తానని తెలిపారు.
కానీ తన రాజ్యాంగ, రాజకీయ బాధ్యతలను నిర్వర్తించేందుకు సమన్ల సమయం అడ్డుగా వస్తోందని శివకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని చూసి, తనను చూసి భయాందోళనకు గురవుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీలో ఎంత మంది లేరు. వారికి ఎందుకు సమన్లు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు డీకేఎస్.
Also Read : తెలంగాణకు వాన గండం తప్పదు కష్టం