ED Summons Jharkhand CM : జార్ఖండ్ సీఎంకు ఈడీ షాక్

గురువారం హాజ‌రు కావాలంటూ ఆదేశం

ED Summons Jharkhand CM : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ షాక్ ఇచ్చింది. ఈ మేర‌కు అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారంలో స‌మ‌న్లు జారీ(ED Summons Jharkhand CM) చేసింది. న‌వంబ‌ర్ 3 గురువారం త‌మ ముందు హాజ‌రు కావాల‌ని స‌మ‌న్ల‌లో ఆదేశించింది. ఇప్ప‌టికే కేసు న‌మోదు చేసింది.

ఇందులో భాగంగా హేమంత్ సోరేన్ పై గ‌వ‌ర్న‌ర్ కు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఫిర్యాదు చేయ‌డంతో ఏకంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. ఒక‌వేళ మైనింగ్ వ్య‌వ‌హారంలో సీఎం ప్ర‌మేయం ఉన్న‌ట్ల‌యితే వెంట‌నే ఆయ‌న శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయొచ్చంటూ ఈసీ స్ప‌ష్టం చేసింది.

దీంతో గ‌వ‌ర్న‌ర్ చ‌ర్య‌కు ఉప‌క్ర‌మించారు. దీనిని ఆస‌రాగా చేసుకుని బీజేపీ రంగంలోకి దిగింది. వెంట‌నే జార్ఖండ్ లో స‌ర్కార్ ను కూల్చాల‌ని ప్లాన్ చేసింది. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ముందే ప‌సిగ‌ట్టిన హేమంత్ సోరేన్ గ‌వ‌ర్న‌ర్ కు లేఖ రాశారు. అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టాల‌ని కోరారు.

విశ్వాస తీర్మానంలో జేఎంఎం విజ‌యం సాధించింది. ఇక్క‌డ కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో హేమంత్ సోరేన్ సీఎంగా కొన‌సాగుతూ వ‌స్తున్నారు. ఇదిలా ఉండ‌గా సీఎంకు స‌న్నిహితుడిగా పేరొందిన పంక‌జ్ మిశ్రాను ఇప్ప‌టికే ఈడీ అరెస్ట్ చేసింది. ఇందుకు సంబంధించి మ‌నీ లాండ‌రింగ్ కేసు న‌మోదు చేసిది.

జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు చేప‌ట్టింది. మొత్తం 50 బ్యాంకు అకౌంట్ల‌ను సీజ్ చేసింది. మొత్తం రూ. 13. 32 కోట్ల న‌గ‌ద‌ను సీజ్ చేసింది ఈడీ. మ‌రో వైపు సీఎం సోరేన్ కు వ్య‌క్తిగ‌తంగా స‌హాయ‌కురాలిగా పేరొందిన సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ పూజా సింఘాల్ నివాసంలో కూడా ఈడీ దాడి చేసింది.

Also Read : క‌ర్ణాట‌క స‌ర్కార్ పై సిద్ద‌రామ‌య్య క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!