Sanjay Raut Wife ED : సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు
మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి
Sanjay Raut Wife ED : మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీ ఇవాల్టితో ముగిసింది. ప్రత్యేక కోర్టులో హాజరు పర్చనున్నారు.
ఇదిలా ఉండగానే సంజయ్ రౌత్ కు(Sanjay Raut Wife ED) కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ఈ మేరకు ఆయన భార్య వర్షా రౌత్ కు గురువారం సమన్లు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించి తమ ముందు విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఒకవేళ కావాలని రాక పోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందంటూ హెచ్చరించింది.
ఇదిలా ఉండగా పీఎంసీ బ్యాంక్ మోసం కేసుకు సంబంధించి వర్షా రౌత్ కు ఈ సమన్లు జారీ చేసింది. 2010, 2011లో తన వ్యాపార భాగస్వామి అయిన ప్రవీణ్ రౌత్ భార్య మాధురీ రౌత్ తన ఖాతాకు రూ. 55 లక్షల వడ్డీ లేని రుణాన్ని బదిలీ చేయడం గురించి ప్రశ్నించారు.
దీనికి సంబంధించి వర్షా రౌత్ ఇప్పటికే ఈడీ ముందు విచారణకు హాజరైంది. తాజాగా సంజయ్ రౌత్ కేసులో ఛత్రా రీ డెవలప్ మెంట్ స్కాంకు సంబంధించి రూ. 1.06 కోట్లు అప్పనంగా అందాయని ఇందులో రౌత్ భార్య వర్షా రౌత్ పాత్ర కూడా ఉందని ఈడీ ఆరోపించింది.
ఇదిలా ఉండగా ఇదంతా రాజకీయంగా వేధింపులకు గురి చేయడంలో భాగంగానే తన భార్యకు సమన్లు జారీ చేసిందంటూ సంజయ్ రౌత్ ఆరోపించారు.
రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కోలేక కుటుంబాన్ని ఇన్ వాల్వ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను భయపడే ప్రసక్తి లేదన్నార వర్షా రౌత్. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని పేర్కొన్నారు.
Also Read : రేపే కాంగ్రెస్ చలో రాష్ట్రపతి భవన్