ED Sonia Gandhi : 25న హాజ‌రు కావాల‌ని సోనియాకు స‌మ‌న్లు

జారీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్

ED Sonia Gandhi : నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక‌కు సంబంధించి మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగిందంటూ చేసిన ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఇప్ప‌టికే రాహుల్ గాంధీని ఐదు రోజుల పాటు విచారించింది.

రోజుకు 12 గంట‌ల చొప్పున ఈ విచార‌ణ సాగింది. అయితే ఇదే కేసుకు సంబంధించి గ‌తంలోనే ప‌లుమార్లు ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. త‌ల్లి సోనియా గాంధీకి, కొడుకు రాహుల్ గాంధీకి.

అయితే రాహుల్ హాజ‌రు కాగా సోనియా గాంధీకి(ED Sonia Gandhi) కోవిడ్ ఎఫెక్ట్ కార‌ణంగా హాజ‌రు కాలేక పోయింది. 21న గురువారం మ‌ధ్యాహ్నం ఈడీ ముందు హాజ‌రైంది.

ఈ సంద‌ర్భంగా నేష‌న‌ల్ హెరాల్డ్ కు సంబంధించి నిధులు ఎలా దారి మ‌ళ్లించార‌నే దానిపై నాలుగు గంట‌ల పాటు సోనియా గాంధీని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది ఈడీ. 75 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన సోనియాను త్వ‌ర‌గా విచారించి వ‌దిలేసింది.

ఆమెను విచారించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది కాంగ్రెస్ పార్టీ. మ‌రో వైపు పెద్ద ఎత్తున పార్టీ నాయ‌కులు, శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో న‌గ‌రంలో కొంత ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది.

ఇది పూర్తిగా క‌క్ష సాధింపు చ‌ర్య‌లో భాగమేనంటూ నిప్పులు చెరిగారు కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబ‌రం. రాత్రి 9 గంట‌ల దాకా తాను స‌మాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నాన‌ని సోనియా గాంధీ ఈడీ అధికారుల‌కు స్ప‌ష్టం చేసింద‌ని ఎంపీ వెల్ల‌డించారు.

తాను క‌రోనా పేషెంట్ న‌ని, త‌న మందులు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఏ స‌మ‌యంలో రావాలో ముందుగా చెప్పాల‌ని కోరింద‌న్నారు జైరాం ర‌మేష్.

Also Read : ఫ్యాక్ట్ చెక్ పేరుతో విద్వేషం త‌గ‌దు

Leave A Reply

Your Email Id will not be published!