Edappadi K Palaniswami : పన్నీర్ సెల్వంపై పళనిస్వామి ఫైర్
అన్నాడీఎంకేకు నువ్వు చీఫ్ వి కాదు
Edappadi K Palaniswami : అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు మరింత ముదిరి పాకాన పడింది. పార్టీకి నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. పార్టీకి చీఫ్ ఎవరనే దానిపై గత కొంత కాలంగా మాజీ సీఎం ఎడాపొడి పళని స్వామి(Edappadi K Palaniswami) , మాజీ సీఎం పన్నీర్ సెల్వంల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
చివరకు ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. చివరకు పరిస్థితి విషమించడంతో ఎవరు ఉండాలనే దానిపై కోర్టును ఆశ్రయించారు. కోర్టు ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంచింది.
తాజాగా పళనిస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. అన్నాడీఎంకేకు పన్నీర్ సెల్వం సుప్రీం కాదని, ఆయన ఇంత వరకు బాస్ అనుకుంటున్నారంటూ మండిపడ్డారు.
తాను పార్టీ సమన్వయకర్తను కానని స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబర్ 1న జరిగిన సర్వ సభ్య సమావేశంలో పార్టీ చట్టాలకు సంబంధించి చేసిన సవరణలను ఆమోదించ లేదని అన్నారు.
అందుకే తనకు సంబంధించిన కో ఆర్డినేటర్ పోస్టును నిలిపి వేసినట్లు చెప్పారు పళని స్వామి(Edappadi K Palaniswami) . ఇలా పన్నీర్ సెల్వంపై బహిరంగంగా విమర్శించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఓపీఎస్, ఈపీఎస్ లు తమ కోశాధికారి, ప్రధాన కార్యాలయ కార్యదర్శి పదవుల్లో మాత్రమే కొనసాగుతున్నారని పళనిస్వామి శిబిరం పేర్కొంది.
పార్టీ చట్టాలను సవరించాక ఓపీఎస్ , ఈపీఎస్ గత ఏడాది పార్టీ సమన్వయకర్తగా, జాయింట్ కోఆర్డినేటర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈపీఎస్ తన లేఖలో ఓపీఎస్ ను పార్టీ కోశాధికారిగా సంబోదించారు.
మరో వైపు పార్టీపై పట్టు కోసం బహిష్కృత నాయకురాలు వీకే శశికళ పావులు కదుపుతోంది. మొత్తంగా ఒకనాడు ఒక వెలుగు వెలిగిన అన్నాడీఎంకే ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది.
Also Read : ఫడ్నవీస్ సంతోషంగా లేడు – పవార్