Eknath Shinde : వాహనదారులకు షిండే ఖుష్ కబర్
పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు
Eknath Shinde : మహారాష్ట్రలో కొత్తగా కొలువు తీరిన శివసేన, బీజేపీ సంకీర్ణ సర్కార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం అసెంబ్లీలో సీఎంగా కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది.
అనంతరం సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) వాహనదారులకు ఖుష్ కబర్ చెప్పారు. రాష్ట్రంలో ఇంధనం చౌకగా లభిస్తుందని , దానిపై పన్ను విధింపును తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్రాలు చాలా వరకు ఇంధన ధరలు తగ్గించాయి. కానీ ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్రాలలో ఇంకా ఆ నిర్ణయం తీసుకోలేదు.
ఇంధనంపై వ్యాట్ ను తగ్గిస్తున్నట్లు తెలిపారు సీఎం. మొదటి రోజే ప్రజాకర్షక చర్యల్లో ఇది మొదటి నిర్ణయం. గత ఏడాది నవంబర్ లో కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 5 నుంచి రూ. 10 దాకా తగ్గించింది. మేలో కేంద్రం ఎక్సై్ సుంకాన్ని తగ్గించడంతో యూపీ వంటి రాష్ట్రాలు వ్యాట్ ను మరింత తగ్గించాయి.
కాగా ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యగా ఇంధనంపై అన్ని రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాలని సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. కానీ విపక్షాల ఆధీనంలోని ప్రభుత్వాలు పట్టించు కోలేదు.
ఇదిలా ఉండగా ఆటో రిక్షా స్థాయి నుంచి సీఎం ఉన్నత పదవి స్థాయి వరకు చేరుకున్న ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) కు ప్రజల కష్టాలు ఏంటో బాగా తెలుసు. ఆయన గల్లీ నుంచి మరాఠా పీఠం దాకా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.
Also Read : మరాఠా సీఎం షిండే భావోద్వేగం
This Cabinet will discuss reducing VAT on petrol and diesel to provide relief to the people, said Maharashtra CM Eknath Shinde in Assembly pic.twitter.com/7VWUs76DSJ
— ANI (@ANI) July 4, 2022