CM Eknath Shinde : మిలింద్ సార్వేకర్ ను కలిసిన షిండే
మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు సపోర్టర్
CM Eknath Shinde : మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే సహాయకుడిగా పేరొందిన మిలింద్ సార్వేకర్( Milind Narvekar) ను ప్రస్తుత మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
వీరిద్దరి కలయిక రాష్ట్రంలో కలకలం రేపింది. శివసేన పార్టీ చీఫ్ ఠాక్రేకు షాక్ కు గురి చేశారు ఏక్ నాథ్ షిండే(CM Eknath Shinde). తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఉమ్మడి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించారు.
ఆపై భారతీయ జనతా పార్టీ మద్దతుతో సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా గణేశుడిని దర్శించు కునేందుకు మిలింద్ సార్వేకర్ నివాసానికి వెళ్లినట్లు చెబుతున్నారు.
కానీ ఈ కీలక భేటీ వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు వినాయక చవితి ఉత్సవాలను.
ఇదే సమయంలో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) వ్యక్తిగత కార్యదర్శి మిలింద్ సార్వేకర్ ను కలుసు కోవడం కలకలం రేపింది. ఇద్దరూ కీలకమైన నేతలు కావడంతో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా ఏక్ నాథ్ షిండే శివసేన ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు బావుటా ఎగుర వేసి క్యాంపులలో ఉన్న సమయంలో ఉద్దవ్ ఠాక్రే సహాయకుడు సార్వేకర్ చర్చలు జరిపేందుకు ప్రయత్నం చేశారు.
కానీ ఆ ప్రయత్నాలు ఏవీ సక్సెస్ కాలేదు. సూరత్ హోటల్ లో ఉన్న సమయంలో ఆయన అక్కడికి వెళ్లారు. మరో వైపు శివసేన పార్టీ ఎవరదనే దానిపై కోర్టులో కేసు నడుస్తోంది.
Also Read : మురుగ మఠం మఠాధిపతి అరెస్ట్