Eknath Shinde : ఉద్ధవ్ ఠాక్రేజీ కలకాలం జీవించండి
ఏక్ నాథ్ షిండే పుట్టిన రోజు అభినందనలు
Eknath Shinde : నిన్నటి దాకా వారిద్దరూ ఒకే ప్రభుత్వంలో ఉన్నారు. ఒకరు సీఎంగా పని చేశారు మరొకరు మంత్రిగా పని చేశారు. కానీ సీన్ మారింది. పరిస్థితి తలకిందులైంది. మంత్రి సీఎంగా కొలువుతీరారు.
సీఎంగా ఉన్న వారు మాజీ సీఎంగా మారి పోయారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు ఒకరు శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కాగా మరొకరు మహా వికాస్ అఘాడీలో తిరుగుబాటు జెండా ఎగుర వేసిన వ్యక్తి మాస్ లీడర్ గా పేరొందిన ఏక్ నాథ్ షిండే.
భారతీయ జనతా పార్టీ మద్దతుతో మరాఠా కుర్చీపై సీఎంగా కొలువు తీరారు. ఇటీవలే తాను శస్త్ర చికిత్స కోసం ఆస్పత్రిలో ఉండగానే తనపై కుట్ర పన్నారంటూ మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన ఆరోపణలు చేశారు ఏక్ నాథ్ షిండే.
శివసేన పార్టీ అధికారిక పత్రిక సామ్నా ఇంటర్వ్యూలో తాను ఎలా మోస పోయానో పూసగుచ్చినట్లు చెప్పారు. తాను నమ్ముకున్న వాళ్లే తనను మోసం చేశారని ఆరోపించారు ఉద్దవ్ ఠాక్రే.
తన తండ్రి బాలా సాహెబ్ ఠాక్రే ఫోటోలు లేకుండా మీ తండ్రుల ఫోటోలు పెట్టుకుని ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ తరుణంలో జూలై 27 బుధవారం ప్రత్యేకమైనది.
ఎందుకంటే ఇవాళ శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే పుట్టిన రోజు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభినందనలు, శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే తనను తీవ్రంగా దూషిస్తూ వచ్చిన సీఎం ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) ఊహించని రీతిలో ట్విట్టర్ వేదికగా ఉద్దవ్ ఠాక్రేకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మీరు కలకాలం నిండు ఆయురారోగ్యంతో జీవించాలని కోరారు.
Also Read : ఘనమైన వారసత్వానికి ‘ఠాక్రే’ ప్రతీక