Eknath Shinde : ఆదిత్యా ఠాక్రేకు అంత సీన్ లేదు

నిప్పులు చెరిగిన సీఎం షిండే

Eknath Shinde :  శివసేన అగ్ర నాయ‌కుడు, మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రే త‌న వ‌య‌స్సుకు మించి ఎక్కువ మాట్లాడుతున్నార‌ని కొంత త‌గ్గితే బావుంటుంద‌ని సూచించారు మ‌రాఠా సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde).

ప‌దే ప‌దే త‌న‌ను టార్గెట్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఎవ‌రికి బ‌లం ఉందో ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తార‌ని అది త్వ‌ర‌లోనే తేలుతుంద‌న్నారు.

తాను ద్రోహానికి త‌ల‌పెట్టాన‌ని ఆయ‌న అంటున్నారు. ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. మ‌రి మిత్ర ధ‌ర్మాన్ని కాద‌ని ఎవ‌రితో చేతులు క‌లిపారో ముందు మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే, ఆదిత్యా ఠాక్రే తెలుసు కోవాల‌న్నారు.

త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేసినంత మాత్రాన ప్ర‌జ‌లు ఓట్లు వేస్తార‌ని అనుకోవ‌డం ఒట్టి భ్ర‌మ‌గా కొట్టి పారేశారు ఏక్ నాథ్ షిండే. రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ వ్యూహం ఏమిటో తమ‌కు ఉంద‌న్నారు.

ఏ ప‌నులు చేయ‌ని వాళ్లే ఆరోప‌ణ‌ల‌కు దిగుతార‌ని , తామేమిటో తాము చేసే ప‌నుల్లో తెలుస్తుంద‌న్నారు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde).

ప్ర‌ధానంగా ఆదిత్యా ఠాక్రే(Aditya Thackeray) త‌న వ‌య‌స్సు తెలుసుకొని మాట్లాడాలి. దివంగ‌త మ‌రాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే, ఆయ‌న ఆలోచ‌నా విధానం వ‌ల్ల‌నే తాము ఇక్క‌డ ఉన్నామ‌ని అన్నారు.

కానీ ఆదిత్యా, ఉద్ద‌వ్ ఠాక్రే లు బాలా సాహెబ్ ను ఏనాడో మ‌రిచి పోయారంటూ ఆరోపించారు. అందుకే తాము శివ‌సేన పార్టీపై తిరుగుబాటు చేయాల్సి వ‌చ్చింద‌న్నారు ఏక్ నాథ్ షిండే.

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆదిత్యా ఠాక్రే ప్ర‌చారం చేప‌ట్టారు. ర్యాలీల‌కు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు. త‌మ‌కు జ‌రిగిన మోసంపై వివ‌రిస్తున్నారు. ముందుకు సాగుతున్నారు.

Also Read : క‌ర్ణాట‌క మంత్రి ఉమేష్ క‌త్తి క‌న్నుమూత

Leave A Reply

Your Email Id will not be published!