TS Health Director : సీఎం కాళ్లు మొక్కిన విద్యా శాఖ డైరెక్టర్
వివాదస్పదంగా మారిన శ్రీనివాసరావు తీరు
TS Health Director : రాష్ట్రం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. గతంలో జిల్లా కలెక్టర్ ఇలాగే చేసి కోర్టు మెట్లు ఎక్కారు. టీఆర్ఎస్ పాలనలో స్వామి భక్తి మరింత పెరుగుతోంది. తగదునమ్మా అంటూ సమయం చిక్కితే చాలు సాగిల పడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాల్సిన వాళ్లు పాలకులకు అడుగులు మడుగులు ఒత్తడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా తెలంగాణ విద్యా శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు(TS Health Director) హాట్ టాపిక్ గా మారారు. ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. సీనియారిటీ లేకుండానే అక్రమ పద్దతుల్లో విద్యా శాఖ డైరెక్టర్ పదవిలో చేరారంటూ పెద్ద ఎత్తున విమర్శలు నెలకొన్నాయి. కొమరవెల్లి మల్లన్నకు మొక్కులు తీర్చుకున్నట్లు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కేందుకు పోటీ పడుతున్నారు ఉన్నతాధికారులు.
గతంలో కలెక్టర్లు కాళ్లు మొక్కితే ప్రస్తుతం శ్రీనివాస రావు కాళ్లు పట్టుకున్నంత పని చేశారు. ఆయనను చూసీ చూడకుండానే వెళ్లి పోయారు సీఎం. ప్రగతి భవన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యా శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ పదే పదే కాళ్లు మొక్కడం చర్చకు దారి తీసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించారు వర్చువల్ గా. ప్రారంభించిన అనంతరం విద్యా శాఖ డైరెక్టర్(TS Health Director) కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. అనంతరం కాళ్లు మొక్కారు..మళ్లీ వెళుతుండగా కాళ్లు మొక్కి స్వామి భక్తిని చాటుకున్నారు.
ఇదిలా ఉండగా మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ట్విట్టర్ వేదికగా వైద్య శాఖ డైరెక్టర్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఆయన వీడియోను కూడా షేర్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసమే ఇలా చేశారంటూ ఆరోపించారు.
Also Read : యుద్దం చేయాల్సిందే బీజేపీని తరమాల్సిందే
కొత్తగూడెం అసెంబ్లీ TRSటికెట్ గురించే కదా Dr శ్రీనివాస్ CM కాళ్ళు పట్టుకోడం. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే.పదవి misuse చేస్తూ కొత్తగూడెం లో ఎదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారు.వీడియో👇 pic.twitter.com/VmX8DZYc5C
— Murali Akunuri (@Murali_IASretd) November 16, 2022