Uddhav vs Shinde EC : ఉద్ద‌వ్ ఠాక్రే..ఏక్ నాథ్ షిండేకు ఈసీ షాక్

శివ‌సేన గుర్తు వాడ‌కుండా నిషేధం

Uddhav vs Shinde EC : శివ‌సేన పార్టీ గుర్తు ఎవ‌రిద‌నే దానిపై నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర దించింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఈ మేర‌కు కోర్టును ఆశ్ర‌యించిన శివ‌సేన పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav vs Shinde), తిరుగుబాటు జెండా ఎగుర వేసి ప్ర‌స్తుతం మ‌రాఠా సీఎంగా కొన‌సాగుతున్న ఏక్ నాథ్ షిండేకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.

ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల వాద‌న‌ల మ‌ధ్య శివ‌సేన చిహ్నంపై పోల్ బాడీ బిగ్ ఆర్డ‌ర్ జారీ చేసింది. ఇదిలా ఉండ‌గా ముంబై లోని అంధేరీ ఈస్ట్ లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల్లో ఉద్ద‌వ్ ఠాక్రే వ‌ర్గం ఇప్పుడు వేరే పేరు, గుర్తును ఉప‌యోగించాల్సి ఉంటుంది. జూన్ లో విడి పోయిన‌ప్ప‌టి నుండి బాల్ ఠాక్రే వార‌స‌త్వాన్ని క‌లుషితం చేశారంటూ ఇరు వ‌ర్గాలు ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చాయి.

కాగా ఠాక్రే , షిండే నేతృత్వంలోని శివ‌సేన వ‌ర్గాలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి సంబంధించిన విల్లు, బాణం గుర్తును ఉప‌యోగించ‌కుండా ఎన్నిక‌ల సంఘం నిషేధం విధించింది. నాలుగు నెల‌ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. ఈసీ ఆదేశాల మేర‌కు రెండు గ్రూపులు ఇప్పుడు కొత్త పేర్ల‌ను ఎంచు కోవాల్సి ఉంటుంది.

వారికి వేర్వేరు గుర్తులు కేటాయించ‌నున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం(EC) ప్ర‌క‌టించింది. ఆయా వ‌ర్గాలు అందుబాటులో ఉన్న ఉచిత చిహ్నాల జాబితా నుండి ఎంచుకునే వీలుంద‌ని తెలిపింది. అంతే కాకుండా త‌మ వాద‌న‌ల‌కు మ‌ద్ద‌తుగా ఆగ‌స్టు 8 లోగా శాస‌న‌, సంస్థాగ‌త మ‌ద్ద‌తుపై డాక్యుమెంట‌రీ రుజువుల‌ను స‌మ‌ర్పించాల‌ని ఈసీ ఆదేశించింది ఉద్ద‌వ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండేల‌ను.

 

Also Read : ప్ర‌క‌ట‌న‌ల‌కే ఢిల్లీ స‌ర్కార్ ప‌రిమితం – ఎల్జీ

Leave A Reply

Your Email Id will not be published!