Election Campaign End : ఎన్నికల ప్రచారం పరిసమాప్తం
5 గంటల వరకే క్యాంపెయిన్
Election Campaign End : హైదరాబాద్ – తెలంగాణలో(Telangana) ఇప్పటి వరకు హోరెత్తించిన ఎన్నికల ప్రచారం ముగిసింది. 13 నియోజకవర్గాలలో 4 గంటలకే క్యాంపెయిన్ పూర్తయింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో నిర్దేశించిన టైమ్ కంటే ముందే ప్రచారం ముగించారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రమంతటా మైకులు బంద్ అయ్యాయి.
Election Campaign End Today in Telangana
చాలా చోట్ల కొన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నియమించిన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్స్ సీరియస్ అయ్యారు. వెంటనే నిలిపి వేయాలని ఆదేశించారు.
తొలుత రాష్ట్రంలోని సిర్పూర్ , బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, మంథని, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ , పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావు పేట , భద్రాచలం నియోజకవర్గాలలో తొలుత క్యాంపెయిన్ నిలిపి వేశారు.
5 గంటల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక తెలంగాణ వ్యాప్తంగా మూత పడ్డాయి వైన్ షాప్ లు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ప్రలోభాలకు గురి చేసే వారిపై ఫోకస్ పెట్టాలని ఆదేశించింది. పోస్టల్ బ్యాలెట్ పేపర్లు తమకు రాలేదంటూ ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం కలకలం రేపింది.
Also Read : Rahul Gandhi : రాహుల్ ఆటోలో హల్ చల్