Uddhav Thackeray : ఎన్నిక‌ల సంఘం ప‌క్ష‌పాతం – ఠాక్రే

పార్టీ గుర్తుపై వివ‌క్ష నిజం..మాజీ సీఎం

Uddhav Thackeray :  శివ‌సేన పార్టీ చీఫ్‌, మాజీ మ‌రాఠా సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray)  నిప్పులు చెరిగారు. తాజాగా త‌మ పార్టీకి గుర్తుకు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌కు సంబంధించి మండిప‌డ్డారు. పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో ఉండాల్సిన సీఈసీ ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రించిందంటూ ఆరోపించారు.

గురువారం ఆయ‌న ఈ మేర‌కు దీనిపై స్పందించారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. పార్టీ పేర్లు, చిహ్నాల‌లో ప‌క్ష‌పాతం చూపించిందంటూ ఆరోపించారు. పేర్లు, చిహ్నాల ఎంపిక‌ను ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయ‌డం ద్వారా ఏం చెప్పాల‌ని అనుకుంటుందో చెప్పాల‌ని కోరారు ఠాక్రే.

ఉద్ద‌వ్ ఠాక్రే బృందం 12 అంశాల‌తో సీఈసీకి లేఖ రాసింది. పార్టీకి సంబంధించిన గుర్తులు, పేర్ల‌ను నిర్ణ‌యించ‌డంలో ప్ర‌త్య‌ర్థి ఏక్ నాథ్ షిండే శిబిరానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించారు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) . శివ‌సేన గ్రూపు దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డం క‌ల‌క‌లం రేపింది మ‌రాఠాలో.

బ‌హుషా షిండే త‌న స్వంత జాబితాను స‌మ‌ర్పించడానికి ముందే తాము సూచించిన ఎంపిక‌ల‌ను షిండే టీం కాపీ చేసిందంటూ ఆరోపించారు ఉద్ద‌వ్ ఠాక్రే. ఇదిలా ఉండ‌గా కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అదేమిటంటే ఉద్ద‌వ్ ఠాక్రే వ‌ర్గాన్ని ఇప్పుడు శివ‌సేన ఉద్ద‌వ్ బాలా సాహెబ్ ఠాక్రే అని పిలుస్తారు.

దాని చిహ్నం మండుతున్న టార్చ్ . ఇక ఏక్ నాథ్ షిండే బృందానికి బాలా సాహెబ్ శివ‌సేన అని పేర్కొంది. దీనికి ఒక డాలు, రెండు క‌త్తుల చిహ్నాన్ని కేటాయించింది.

Also Read : హార్దిక్ ప‌టేల్ పై కాంగ్రెస్ సెటైర్

Leave A Reply

Your Email Id will not be published!