Election Commission : ఈసీ సంచలన నిర్ణయం
మిజోరం ఓట్ల లెక్కింపు తేదీ మార్పు
Election Commission : న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలోని 5 రాష్ట్రాలలో పోలింగ్ నిర్వహించింది. మిజోరం, ఛత్తీస్ గఢ్ , తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాలకు కలిపి డిసెంబర్ 3న ఓట్లను లెక్కించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ మీడియా సాక్షిగా స్పష్టం చేశారు.
Election Commission Orders
తాజాగా మిజోరం రాష్ట్రానికి సంబంధించి ఓట్ల లెక్కింపును ఈనెల 3న కాకుండా 4వ తేదీకి మారుస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) ఇవాళ వెల్లడించింది. ఇదిలా ఉండగా తమ రాష్ట్రానికి సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టవద్దంటూ ఆ రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి.
దీంతో ప్రజలు చేసిన విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను మారుస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే సోమవారానికి మార్చినట్లు స్పష్టం చేశారు. ఈ ఒక్క రాష్ట్రానికే మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా మిజోరం రాష్ట్రానికి సంబంధించి 40 స్థానాలకు గాను అక్టోబర్ 9న పోలింగ్ చేపట్టింది ఈసీ.
Also Read : Congress Win : తెలంగాణలో హస్తం హవా