Uddhav Thackeray Modi : ఎన్నికల సంఘం మోదీకి దాసోహం
మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆగ్రహం
Uddhav Thackeray Modi : కేంద్ర ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు మరాఠా మాజీ సీఎం , శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే. ఎవరిది అసలైన శివసేన పార్టీ అనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సీఎంగా ఉన్న , తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన ఏక్ నాథ్ షిండేకు విల్లు, బాణం ఉన్న గుర్తును కేటాయించింది.
దీనిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. శివసేన పార్టీకి చెందిన నాయకులు, శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సర్కార్ పై మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంపై మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray Modi) స్పందించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆరోపించారు.
ఈ సందర్బంగా సీరియస్ కామెంట్స్ చేశారు కేంద్ర ఎన్నికల సంఘంపై. అది ఎన్నికల సంఘం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దాసోహమైందని, ఆయన ఏది చెబితే అదే చేస్తోందంటూ మండిపడ్డారు. తమకు అసలైన గుర్తు కేటాయించక పోవడం వెనుక మోదీ కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు. శనివారం మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోతోందన్నారు.
అటు వైపు న్యాయ వ్యవస్థను ఇటు ఎన్నికల సంఘంను నిర్వీర్యం చేసే పనిలో పీఎం ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది నెలలుగా శివసేన గుర్తును ఎవరు వాడాలనే దానిపై రాద్దాంతం కొనసాగుతూ వచ్చింది. దీనికి తెర దించింది ఈసీ. ఎన్నికల కమిషన్ పారదర్శకతతో లేదని చెప్పేందుకు ఈ నిర్ణయం చాలన్నారు ఉద్దవ్ ఠాక్రే. తాడో పేడో సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు మాజీ సీఎం.
Also Read : మోదీపై జైరాం రమేష్ కన్నెర్ర