Amit Shah EC : అమిత్ షాకు ఎన్నికల సంఘం ఊరట
ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించ లేదు
Amit Shah EC : బీజేపీలో నెంబర్ -2 గా, ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కు ఊరట లభించింది. ఆయన తాజాగా గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బాధ్యత వహించారు. మొత్తం షా తన భుజాల మీదుగా మోశారు. అనూహ్యంగా ఆ పార్టీకి ఘనమైన విక్టరీని నమోదు చేసి పెట్టారు.
దీని వెనుక వ్యూహాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా మరోసారి పని చేసింది. కానీ బీజేపీకి గుజరాత్ లో విజయం లభించినా హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం పవర్ కోల్పోయింది. షాకు సంబంధించినంత వరకు స్వంత రాష్ట్రంగా భావిస్తారు.
ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన కామెంట్స్ చేశారు అమిత్ షా. ఖేడా జిల్లా లోని మహుధా పట్టణంలో జరిగిన ర్యాలీ, ప్రచార సభలో కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి. గుజరాత్ లో 2002లో జరిగిన హింసాకాండకు పాల్పడిన వారికి కఠిన చర్యలు తీసుకున్నామని, ఈ సందర్భంగా శాంతి నెలకొల్పామని చెప్పారు.
గుజరాత్ ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah EC) చేసిన వ్యాఖ్యలు ఎన్నికల సంఘానికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోకి రాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం కీలక ప్రకటన చేసింది. దీంతో అమిత్ షాకు భారీ ఊరట లభించినట్లయింది.
ఏది ఏమైనా ఎన్నికల్లో పొలిటికల్ లీడర్లు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేధావులు పేర్కొంటున్నారు.
Also Read : ట్వీట్ సరే 135 మంది మాటేంటి – గోఖలే