Supreme Court PM : ప్రధానిని ఎన్నికల సంఘం ఎదుర్కోగలదా
సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన కామెంట్స్
Supreme Court PM : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐదుగురు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలక ప్రశ్నలు లేవనెత్తింది. అత్యంత సామర్థ్యం, నిబద్దత కలిగిన పోలింగ్ ప్యానల్ ఉండాలని స్పష్టం చేసింది.
భారత రాజ్యాంగ ప్రకారం ఎన్నికల సంఘం అత్యంత ముఖ్యమైన సంస్థ అని ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత ఈసీపై ఉంటుందని పేర్కొంది ధర్మాసనం. కేంద్ర ఎన్నికల సంఘంలో సమర్థవంతులైన వారిని ఎంపిక చేయడం లేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై విచారించిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఈ సందర్బంగా దేశ ప్రధాన మంత్రిని కేంద్ర ఎన్నికల సంఘం ఎదుర్కోగలదా, ఆ సత్తా సామర్థ్యం ఉందా అని ధర్మాసనం(Supreme Court PM) ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు సమర్థులైన అధికారులను నియమించడం లేదంటూ నిలదీసింది.
ఒక రకంగా కేంద్ర సర్కార్ ను కడిగి పారేసింది ధర్మాసనం. భారత దేశ అత్యున్నత ఎన్నికల సంఘం స్వాతంత్రంపై సుప్రీంకోర్టు కేంద్ర సర్కార్ ను ఎత్తి చూపింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందించారు. కోర్టు జోక్యం చేసుకోవడానికి విచ్చలవిడి సందర్భాలు కారణం కాకూడదన్నారు.
స్థానాన్ని కాపాడు కోవడమే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరం తెలిపింది కోర్టు. పారదర్శకమైన యంత్రాంగం ఉండాలని స్పష్టం చేసింది.
ప్రజాస్వామ్యం ఈ దేశానికి ఆయువుపట్టు. దీనిని నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. అది ప్రధానమంత్రి అయినా లేదా ఇంకెవరైనా. చట్టాలు చేసినంత మాత్రాన పవర్ ఉన్నట్లు కాదని పేర్కొంది ధర్మాసనం.
స్వేచ్ఛ అన్నది ఎన్నికల సంఘానికి అవసరమని అభిప్రాయ పడింది.
Also Read : జైలు మాన్యువల్ చదవక పోతే ఎలా – లేఖి