Edappadi Palaniswami : పళనిస్వామి ఎన్నిక చెల్లదు – హైకోర్టు
మాజీ సీఎంకు కోలుకోలేని షాక్
Edappadi Palaniswami : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడాపాడి పళనిస్వామికి(Edappadi Palaniswami) కోలుకోలేని షాక్ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ ఎవరిదనే దానిపై మాజీ డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కు మధ్య వివాదం నడిచింది.
ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. అయితే సిటీ కోర్టు పళనిస్వామికి లైన్ క్లియర్ ఇచ్చింది. దీంతో పన్నీర్ సెల్వంను పక్కన పెట్టారు. ఆయన లేకుండానే పళని స్వామి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
దీంతో పళనిస్వామి ఎన్నిక అక్రమమని, చెల్లదంటూ పన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు కోలుకోని బిగ్ షాక్ ఇచ్చింది.
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పింది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు విరుద్దమని పేర్కొంది.
ఇదిలా ఉండగా పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం పన్నీర్ సెల్వం ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం , కోశాధికారి పదవి నుండి బహిష్కరించింది.
దీనిని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు పన్నీర్ సెల్వం. 68 ఏళ్ల పళని స్వామి పన్నీర్ సెల్వంపై దాడి ప్రారంభించారు. స్వార్థ పరుడంటూ ఆరోపించారు.
ఆపై ఆయన వల్లనే పార్టీ భ్రష్టు పట్టిందని పేర్కొన్నారు. దీంతో పన్నీర సెల్వం మద్దతుదారులు తీవ్రంగా మండిపడ్డారు పళనిస్వామిపై.
ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ మోసం చేశారంటూ పన్నీర్ సెల్వం మద్దతుదారులు. మొత్తంగా పళని స్వామి మరి ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇద్దరూ ఒకప్పుడు కలిసి ఉన్నారు. తర్వాత పవర్ పోయాక పార్టీపై పట్టు కోసం కొట్టుకు చస్తున్నారు.
Also Read : దేశ వ్యతిరేకులకు కాంగ్రెస్ మద్దతు