Electricity Charges : ఓ వైపు పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరలతో మోదీ సర్కార్ మోత మోగిస్తోంది. తానేమీ తక్కువ తినలేదంటూ నిన్నటి దాకా ధనిక రాష్ట్రం అంటూ ఊదర గొడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల(Electricity Charges) పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏకంగా 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఓకే చెప్పింది. ఇవాళ అధికారికంగా డిక్లేర్ చేసింది.
ఇక ఈ పెంచిన విద్యుత్ ఛార్జీల మోత ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఇక ఛార్జీల పరంగా చూస్తే గృహ ఉపయోగ విద్యుత్ వాడకంపై 50 పైసలు పెంచింది.
ఇతర కేటగిరీలకు రూపాయి చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖ పరిధిలోని డిస్కంలు 19 శాంత పెంచాలని ప్రతిపాదించాయి. కానీ రెగ్యులేటరీ కమిషన్ మాత్రం 14 శాతానికి పర్మిషన్ ఇచ్చింది.
దాదాపు 10 వేల కోట్లకు పైగా ద్రవ్యలోటు ఉందని నివేదికలు అందాయి. గతంలోనే పెంచుతారని అనుకున్నారు. కానీ ఎండా కాలం టీఎస్ సర్కార్ (Electricity Charges)దొంగ దెబ్బ కొట్టింది.
ఇదిలా ఉండగా డిస్కంల ప్రతిపాదనలతో పాటు వినియోగదారుల అభిప్రాయాలను, సూచనలు పరిగణలోకి తీసుకున్నామని వాటన్నింటినీ పరిశీలించాకే పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు వెల్లడించారు.
ఈ ఛార్జీలు వెంటనే అమలులోకి వస్తాయన్నారు. ఇదిలా ఉండగా వ్యవసాయ రంగానికి మాత్రం పెంపులో మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు.
Also Read : ఊపిరి ఉన్నంత దాకా కాంగ్రెస్ లోనే