Minister Atishi : ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీ బంద్
నేటి నుంచేనన్న ఆప్ సర్కార్
Minister Atishi : ఢిల్లీ ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ శుక్రవారం నాటితో ముగియనుంది. ఆప్, లెఫ్టినెంట్ గవర్నర్ ల మధ్య ఆధిపత్య పోరు దీనికి ప్రధాన కారణమని ఆప్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా ఆప్ ప్రభుత్వం కొలువు తీరాక 200 యూనిట్ల నెల వారీ వినియోగించే వినియోగదారులకు ఉచిత విద్యుత్ ను అందిస్తూ వచ్చింది. ఈ మేరకు 2023-24 బడ్జెట్ లో విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 3,250 కోట్లు కేటాయించింది.
ఈ సారి దేశ రాజధానిలో దాదాపు 46 లక్షల మందికి విద్యుత్ సబ్సిడీపై వేటు పడనుంది. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వచ్చే ఏడాదికి దానిని పొడిగించే ఫైల్ ను ఇంకా క్లియర్ చేయలేదు. దీంతో ఇవాల్టి నుంచి సబ్సిడీలను నిలిపి వేస్తున్నట్లు ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి అతిషి ప్రకటించారు.
46 లక్షల మందికి తాము ఇస్తున్న సబ్సిడీ ఆగి పోతుందన్నారు. సోమవారం నుంచి ప్రజలకు సబ్సిడీ లేకుండా పెంచిన బిల్లులు అందుతాయని స్పష్టం చేశారు. ఆమె(Minister Atishi) ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఆప్ ఇప్పటికే కీలకమైన ఈ ఫైల్ ను సంతకం చేసేందుకు ఎల్జీ ఆమోదం కోసం పంపామని కానీ ఇప్పటి వరకు దానిపై నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. దీనిపై ఆమె తప్పు పట్టారు.
దీనిపై ఎల్జీ కార్యాలయం తీవ్రంగా తప్పు పట్టింది. అనవసర రాజకీయాలు మానుకోవాలని అతిషికి సూచించింది. ఏప్రిల్ 4 వరకు నిర్ణయాన్ని ఎందుకు పెండింగ్ లో ఉంచారని ప్రశ్నించింది. ఏప్రిల్ 15 వరకు గడువు ముగియడంతో ఏప్రిల్ 11న ఎందుకు ఫైల్ పంపారని మండిపడింది.
Also Read : నేతలు వీడినా కార్యకర్తలు పార్టీ వెంటే