Elon Musk Shock : కాంట్రాక్టు ఉద్యోగుల‌పై మ‌స్క్ వేటు

ట్విట్ట‌ర్ లో కొన‌సాగుతున్న తొల‌గింపు

Elon Musk Shock : ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్న ఎలాన్ మ‌స్క్ కోలుకోలేని షాక్(Elon Musk Shock) ఇచ్చాడు. సోష‌ల్ మీడియాలో టాప్ లో కొన‌సాగుతోంది ట్విట్ట‌ర్. కానీ రూ. 4,400 కోట్ల‌కు కొనుగోలు చేసిన వెంట‌నే కీల‌క‌మైన పోస్టుల‌లో ఉన్న వారంద‌రినీ తొల‌గించాడు. ఆపై కీల‌క‌మైన వ్య‌క్తుల ప‌నితీరుపై నిఘా పెట్టాడు.

ఆపై వందలాది మందికి ఇమెయిల్స్ ద్వారా హెచ్చ‌రిక‌లు జారీ చేశాడు. నెట్ యాక్సెస్ ఎవ‌రికైతే ఉంటుందో వారే ఉద్యోగులుగా ప‌రిగ‌ణ‌మిస్తామంటూ స్ప‌ష్టం చేశాడు. దీంతో 7,500 మంది ఉద్యోగుల‌లో ప్ర‌స్తుతం స‌గానికి పైగా త‌గ్గించాడు. ఆపై అన‌వ‌స‌ర ఖ‌ర్చును ఒప్పుకోన‌ని పేర్కొన్నాడు.

అంతే కాదు ఉచిత ఫుడ్ ఉండ‌ద‌న్నాడు. ఎవ‌రైనా ఏ స్థాయిలో ఉన్న వారైనా స‌రే ఆఫీసుల‌కు రావాల్సిందేన‌ని హుకూం జారీ చేశాడు. తాజాగా అమెరికా మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మ‌రో 5 వేల మంది కాంట్రాక్టు ఎంప్లాయిస్ కు చెక్ పెట్టాడ‌ని. ఇదిలా ఉండ‌గా ఏడాదికి ఒక్క శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్ర‌ధాన కార్యాల‌యంలోనే ఏకంగా $13 మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చువుతోంద‌ని మండిప‌డ్డాడు.

ఆపై చాలా మంది క‌రోనా కార‌ణంగా ఆఫీసుల‌కు రాన‌ప్పుడు ఇంత ఖ‌ర్చు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించాడు. దీంతో చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ కు ట్విట్ట‌ర్ బాస్ కు మ‌ధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకున్న‌ట్లు టాక్. ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ లో మ‌రో బిగ్ షాక్ ఇచ్చాడు యూజ‌ర్ల‌కు.

ప్ర‌తి నెలా $8 డాల‌ర్లు బ్లూ టిక్ క‌లిగిన వారంతా చెల్లించాల్సిందేనంటూ ప్ర‌క‌టించాడు. దెబ్బ‌కు ట్విట్ట‌ర్ ను వీడుతున్న వారి సంఖ్య మ‌రింత పెరుగుతోంది.

Also Read : రెస్ట్ లేకుండా ప‌ని చేస్తున్నా – ఎలాన్ మ‌స్క్

Leave A Reply

Your Email Id will not be published!