Elon Musk Jack Dorsey : ట్విట్టర్ మాజీ సిఇఓకు మస్క్ ఝలక్
మరింత ముదిరిన టిట్టర్ ఎలోన్ వివాదం
Elon Musk Jack Dorsey : ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానని ఒప్పందం చేసుకున్న టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్(Elon Musk) చివరకు తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు.
ఆపై ఒప్పందం మేరకు తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ కోర్టుకు ఎక్కింది ట్విట్టర్. ప్రస్తుతం న్యాయ స్థానంలో ట్విట్టర్ వర్సెస్ మస్క్ మధ్య వివాదం మరింత ముదిరింది.
తాను అడిగిన డేటాను ఇవ్వలేదని, అందుకే తాను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదని స్పష్టం చేశాడు ఎలోన్ మస్క్. అయితే ఆయన కావాలనే ఇలా చేశాడంటూ ట్విట్టర్ ఆరోపించింది.
అంతే కాకుండా తమ సంస్థపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నించాడంటూ మండిపడింది. తాజాగా లీగల్ ఫైట్ మరింత వేడెక్కింది.
తాజాగా ట్విట్టర్ మాజీ సీఇఓ జాక్ డోర్సీని(Jack Dorsey) టార్గెట్ చేశాడు ఎలోన్ మస్క్. కంపెనీని కొనుగోలు చేసేందుకు ఏప్రిల్ ఒప్పందం గురించి , ప్లాట్ ఫారమ్ లోని స్పామ్ ఖాతాల గురించి పత్రాలు ఇవ్వాలంటూ డోర్సీని అడిగారు.
ఇదిలా ఉండగా జాక్ డోర్సే గత ఏడాది నవంబర్ లో ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రవాస భారతీయుడైన పరాగ్ అగర్వాల్ సిఇఓగా కొలువు తీరాడు.
విచిత్రం ఏమిటంటే మొదటి నుంచీ పరాగ్ అగర్వాల్ ను టార్గెట్ చేస్తూ వచ్చాడు ఎలోన్ మస్క్. ఇంత మంది ఉద్యోగులు అవసరమా అంటూ ప్రశ్నించాడు. మొత్తంగా మరోసారి ట్విట్టర్ మస్క్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : సమయాన్నిపెట్టుబడి పెట్టండి – మహీంద్రా