Elon Musk Shock : ఉద్యోగుల‌కు షాక్ ట్విట్ట‌ర్ డోర్స్ క్లోజ్

ఆఫీస్ కు వ‌ద్దు ఇక ఇంటికి వెళ్లండి

Elon Musk Shock : ట్విట్ట‌ర్ కొత్త బాస్, టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్ కోలుకోలేని షాక్(Elon Musk Shock) ఇచ్చారు. ఇప్ప‌టికే ఆయ‌న దెబ్బ‌కు టాప్ మేనేజ్ మెంట్ అంతా ఇంటిబాట ప‌ట్టారు. తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు ఎలాన్ మ‌స్క్. ఒక‌వేళ ఆఫీసుకు వెళ్లే మార్గంలో గ‌నుక ఉంటే వెంట‌నే తిరిగి ఇంటికి వెళ్లి పోవాలంటూ సూచించారు.

ఈ విష‌యాన్ని అంత‌ర్గ‌త ఈమెయిల్ ద్వారా వెల్ల‌డించారు. ఒక ర‌కంగా ట్విట్ట‌ర్ లో ప‌ని చేస్తున్న ఉద్యోగులకు బిగ్ షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇవాల్టి నుంచి ఉద్యోగుల తొలగింపులు మొద‌ల‌వుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ట్విట్ట‌ర్ త‌న ఆఫీసుల‌ను తాత్కాలికంగా మూసి వేస్తోంద‌ని , అన్ని బ్యాడ్జ్ యాక్సెస్ ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ఎలాన్ మ‌స్క్ ఆధ్వ‌ర్యంలో కంపెనీ భ‌విష్య‌త్తుపై గ‌త వారం రోజులుగా అనిశ్చితి నెల‌కొంది. ఇందులో భాగంగా ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం, తాత్కాలికంగా ఆఫీసుల‌ను మూసి వేయ‌డం, సిబ్బంది యాక్సెస్ ను నిరోధించ‌డం వంటి వాటి గురించి ట్విట్ట‌ర్ ఉద్యోగుల‌కు శుక్ర‌వారం ఇమెయిల్ ద్వారా తెలిపింది సంస్థ‌.

మొత్తం ఈ తొల‌గింపు కార్య‌క్ర‌మం ఉద‌యం 9 గంట‌ల నుంచి ప్రారంభం అవుతుంద‌ని పేర్కొంది. ప్ర‌తి ఉద్యోగి భ‌ద్ర‌త‌తో పాటు ట్విట్ట‌ర్ సిస్ట‌మ్ లు , క‌స్ట‌మ‌ర్ డేటాను నిర్దారించ‌డంలో స‌హాయ ప‌డేందుకు దాని ఆఫీసులు తాత్కాలికంగా మూసి ఉంచుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా తొల‌గింపుల వ‌ల్ల ప్ర‌భావితం కాని ట్విట్ట‌ర్ ఉద్యోగుల‌కు వారి వ‌ర్క్ ఇమెయిల్ ద్వారా తెలియ చేస్తామ‌ని సోష‌ల్ మీడియా ప్లాట్ ఫార‌మ్ పేర్కొంది. ఇప్ప‌టికే సిఇఓ, సీఎఫ్ఓ, లీగ‌ల్ హెడ్ తో పాటు అడ్వ‌ర్టైజింగ్ , మార్కెటింగ్ , హ్యూమ‌న్ రిసోర్సెస్ విభాగాల‌కు చెందిన వారిని ఎలాన్ మ‌స్క్ సాగ‌నంపారు.

Also Read : మెటాకు అజిత్ మోహ‌న్ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!